మహేష్ బాబు పై కక్షతోనే అలా అన్నారంటున్నారు.....??

Mari Sithara
టాలీవుడ్ టాప్  డైరెక్టర్స్ లిస్ట్ లో పూరి జగన్నాథ్ ఒకప్పుడే కాదు, ఇప్పుడు కూడా ఉంటారని మరొక్కసారి తన లేటెస్ట్ మూవీ ఇస్మార్ట్ శంకర్ ద్వారా నిరూపించుకోవడం జరిగింది. ఇక ఇటీవల ఈ సినిమాను చూసిన సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ, ఇంత మంచి సినిమాలు తీయగల సమర్ధత తన దగ్గర ఉంచుకుని కూడా, ఇన్నాళ్లు పూరి సరైన సినిమాలు ఎందుకు తీయలేకపోయాడో తనకు అర్ధం కావడం లేదని ఆయన అనడం జరిగింది. అయితే ఇస్మార్ట్ విజయానందంలో తలమునకలవుతున్న పూరి జగన్నాథ్, ఇటీవల ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ, మహేష్ బాబు కంటే ఆయన అభిమానులు అంటేనే తనకు ఎక్కువ ఇష్టమని, మళ్ళి మహేష్ బాబుతో సినిమా ఎప్పుడు చేస్తారని వాళ్ళు తరచు అడుగుతుంటారని పూరి అన్నారు. 

అయితే, మహేష్ మాత్రం ఎప్పుడూ నేను హిట్స్ లో ఉంటేనే నన్ను పిలుస్తారు అంటూ సూర్ స్టార్ పై ఒక సంచలన కామెంట్ చేసి ఆయన ఫ్యాన్స్ ఆగ్రహానికి కారణం అయ్యారు. పూరి చేసిన కామెంట్స్ ను సీరియస్ గా తీసుకున్న కొందరు మహేష్ ఫ్యాన్స్, ఇప్పటికీ ఆయన మాటలను మర్చిపోలేకపోతున్నారు. ఇక నేడు కొందరు సూపర్ స్టార్ ఫ్యాన్స్ తమ సోషల్ మీడియా ఖాతాల ద్వారా స్పందిస్తూ, అయినా పూరి గారు మహేష్ తోనే కాక, మరికొందరు ఇతర టాలీవుడ్ బడా స్టార్స్ తో కూడా వర్క్ చేసారు కదా, అటువంటపుడు ఆయన ఉన్నట్లుండి మహేష్ పైనే ఎందుకలా కామెంట్ చేసారు అంటూ విమర్శిస్తునారు. ఇక దానికి వారు కారణంగా ఏమి చెపుతున్నారంటే, పూరి మాట్లాడుతూ, నేను ఫ్లాప్స్ లో ఉన్నపుడు మహేష్ పట్టించుకోరని అన్నారు కదా, అయితే మహేష్ తోపాటు ఆయన వర్క్ చేసిన మిగతా స్టార్ హీరోస్ ఉన్నారు కదా, వారు మిమ్మల్ని పట్టించుకోలేదని వారి పేర్లు ఎందుకు చెప్పడం లేదు. అంతేకాక మీరు అనుకున్న జనగణమన సినిమాకు కేవలం మహేష్ తోనే చేయాలి అని మీరు భావించి పలు మార్లు ఈ సినిమా విషయమై ఆయనను కలిశానన్నారు, 

అయితే ఆయనకు మిమ్మల్ని కలవడం కుదరకపోవడమో, లేక మరేదైనా కారణం చేతనో ఆ ప్రాజక్ట్ కు ఇప్పటివరకు మోక్షం కలుగలేదు. అలాంటపుడు మీరు అదే కథను ఇన్నాళ్లు మీదగ్గర ఉంచుకుని మహేష్ మీద నిందలు వేసేబదులు వేరొక హీరోతో ఈ పాటికి సినిమా తీసి ఉనడవచ్చును కదా అనేది వారి వాదన. ఇక మొత్తంగా, వారి మాటలకు అర్ధం ఏంటంటే, కావాలనే పూరి మిగతా హీరోలను వదిలి మహేష్ ని మాత్రమే టార్గెట్ చేసారని అంటున్నారు. అయితే దీనిపై కొందరు సినిమా విశ్లేషకులు స్పందిస్తూ, అటు పూరి కానీ, ఇటు మహేష్ ఫ్యాన్స్ కానీ ఇద్దరూ కూడా చెప్తున్న మాటల్లో వాస్తవం ఉందని, అయితే పూరి కూడా తన జనగణమన, మహేష్ తో వర్కవుట్ కాదు అనుకున్న వెంటనే వేరే హీరోతో అప్పుడే ప్రొసీడ్ అయి ఉంటె బాగుండేదని, అలానే మహేష్ ఫ్యాన్స్ కూడా ఆయన ఏదో బాధలో అన్న ఒక్కమాటను పట్టుకుని ఇంతలా రాద్ధాంతం చేయడం తగదని అంటున్నారు. మరి ఈ వివాదం అసలు పూర్తిగా ఎప్పటికి ముగుస్తుందో చూడాలి.....!!      


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: