టాప్ హీరోలను కలవర పెడుతున్న విజయ్ దేవరకొండ బిజినెస్ టార్గెట్స్ !

Seetha Sailaja
మరి కొద్ది సేపట్లో విజయ్ దేవరకొండ ‘డియర్ కామ్రేడ్’ ఫస్ట్ టాక్ రాబోతున్న నేపధ్యంలో ఈమూవీకి ఏర్పడిన మ్యానియా పై ఇండస్ట్రీ వర్గాలలో ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. టాప్ యంగ్ హీరోలతో సమానంగా క్రేజ్ తెచ్చుకున్న విజయ్ సినిమాలు చాల వరకు 300 శాతం లాభాలతో కూడిన మూవీ ప్రాజెక్టులుగా మారడం ఒక విధంగా ఇండస్ట్రీని ఏలుతున్న టాప్ యంగ్ హీరోలకు కూడ కలవరపాటు కలిగించే అంశం అని అంటున్నారు.

మహేష్ అల్లు అర్జున్ రామ్ చరణ్ ప్రభాస్ లాంటి టాప్ యంగ్ హీరోల సినిమాలు సాధించలేని లాభాల శాతం విజయ్ దేవరకొండ సినిమాల పై ప్రస్తుతం ఆమూవీని కొనుక్కున్న బయ్యర్లకు వస్తున్నాయి అన్నది ఇండస్ట్రీ విశ్లేషకుల వాదన. ఉదాహరణకు ‘గీతాగోవిందం’ సినిమాను 17 కోట్లకు అమ్మడం జరిగితే ఆమూవీ 70 కోట్లు వసూలు చేసింది. ‘టాక్సీవాల’ ను 16 కోట్లకు అమ్మడం జరిగితే ఆమూవీ 21 కోట్లు కలెక్ట్ చేసింది.

విజయ్ దేవరకొండను క్రేజీ హీరోగా మార్చిన ‘అర్జున్ రెడ్డి’ మూవీ బయ్యర్లు అంతా ఒకటికి మూడు రెట్లు లాభాలు తెచ్చుకున్నారు అన్నది ఓపెన్ సీక్రెట్. ఈ నేపధ్యాన్ని కొనసాగిస్తూ ఈరోజు విడుదలైన ‘డియర్ కామ్రేడ్’ మూవీ ప్రపంచ వ్యాప్తంగా 33 కోట్ల బిజినెస్ చేసింది. 

ప్రస్తుతం ‘డియర్ కామ్రేడ్’ కు నడుస్తున్న మ్యానియాను చూస్తుంటే ఈమూవీని కొనుక్కున్న బయ్యర్లు ఈవారాంతానికే లాభాల బాట పట్టినా ఆశ్చర్యం లేదు అని అంటున్నారు. ఇలాంటి లాభాల శాతం మహేష్ చరణ్ బన్నీల సినిమాల విషయంలో బయ్యర్లకు కనిపించడం లేదు. మహేష్ సినిమాలు 100 కోట్ల కలక్షన్స్ సినిమాలుగా మారినా లాభాల శాతంలో మటుకు విజయ్ సినిమాల బయ్యర్లు మహేష్ సినిమాల బయ్యర్ల కన్నా మూడు రెట్లు అధిక లాభాన్ని పొందుతున్నారు. దీనితో ఊహించిన విధంగా డియర్ కామ్రేడ్ సంచలనాలు క్రియేట్ చేస్తే టాలీవుడ్ టాప్ హీరోలలో బయ్యర్లకు కాసులు కురిపించే నిజమైన టాప్ హీరోగా విజయ్ మారిపోతాడు అన్న మాటలు ఇండస్ట్రీని ఏలుతున్న టాప్ యంగ్ హీరోలను కలవర పెడుతున్నట్లు టాక్..   


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: