రూట్ మార్చి నానీని టార్గెట్ చేస్తున్న ప్రభాస్ ఆలోచనలు !

Seetha Sailaja
‘సాహో’ విడుదల వాయిదా పడటం ఇప్పుడు నానీకి ఊహించని తల నొప్పిగా మారింది అన్న వార్తలు వస్తున్నాయి. ‘సాహో’ విడుదల వాయిదాకు సంబంధించి ప్రభాస్ నిన్న ఒక స్థిర నిర్ణయం తీసుకోవడంతో ‘సాహో’ టీమ్ అప్పుడే మరొక డేట్ గురించి ఆలోచనలు మొదలు పెట్టేసింది అని టాక్. 

‘సాహో’ కు సంబంధించి భారీ బిజినెస్ జరగడంతో ఈసినిమా విడుదలను ఎక్కువ రోజులు వాయిదా వేస్తే ఈమూవీ పై ఏర్పడ్డ పాజిటివ్ క్రేజ్ తగ్గిపోతుందని భావిస్తున్న ప్రభాస్ ఆలోచనలు ఇప్పుడు ఆగష్టు 30 పై పడింది అని అంటున్నారు. దీనికి కారణం సెప్టెంబర్ 2 వినాయక చవితి కావడంతో వరస సెలవులు రావడంతో పాటు తెలుగు రాష్ట్రాలలోను అదేవిధంగా ముంబాయ్ లోను వినాయకచవితి అత్యంత ఘనంగా జరుపుతారు కాబట్టి ఆ పండుగ వాతావరణం ‘సాహో’ కు కలిసి వస్తుందని ప్రభాస్ ఆలోచన అని అంటున్నారు. 

అయితే ఇప్పటికే ఆ డేట్ పై నాని ‘గ్యాంగ్ లీడర్’ కన్నేసి వినాయకచవితి సెలవలను ఉపయోగించుకుందాం అనుకున్నాడు. దానికి అనుగుణంగానే నాని తన ‘గ్యాంగ్ లీడర్’ ప్రమోషన్ ను కూడ మొదలు పెట్టేసారు. అయితే ఇప్పుడు ప్రభాస్ సన్నిహితుల నుండి ఈ లీకులు రావడంతో నాని అయోమయంలో పడుతున్నట్లు టాక్. 

ఉరిమిరిమి మీదపడినట్లు ప్రభాస్ వచ్చి ఇప్పుడు నానీ పై పడటంతో నాని ఏనిర్ణయం తీసుకుంటాడు అన్న ఆసక్తి పెరిగిపోతోంది. ‘సాహో’ మ్యానియా ముందు ‘గ్యాంగ్ లీడర్’ నిలవలేదు కాబట్టి ఆగస్టు 15నుకు చిన్న సినిమాలకు పోటీగా తన ‘గ్యాంగ్ లీడర్’ ను దింపుతాడా లేదా సెప్టెంబర్ కు జంప్ చేస్తాడా అన్న విషయం పై క్లారిటీ రావలసి ఉంది.. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: