15 ఏళ్లుగా ఇండస్ట్రీని ఏలుతున్న కత్రీనా కైఫ్ ఈ వయస్సులో కూడా తన హాట్ హాట్ అందాలతో కుర్రాళ్ల మతులు పోగొడుతోంది. 15 సంవత్సరాల పాటు స్టార్ హీరోయిన్ గా ఇండస్ట్రీని ఏలడం అంటే అది హీరోలకు మాత్రమే సాధ్యం అవుతుంది.... కానీ హీరోయిన్లకు కష్టం. అయితే కత్రినా న్యూజనరేషన్ హీరోయిన్లతో పోటీ పడి మరి స్టార్ హీరోలు.. ఇటు జూనియర్లతో సినిమాలు చేసి సూపర్ హిట్లు తన ఖాతాలో వేసుకుంది. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే ఈ భామకు తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో ఏకంగా 24 మంది మిలియన్ల ఫాలోయర్లు ఉన్నారు.
ఇందులో ఎప్పటికప్పుడు తన హాట్ హాట్ ఫోటోలు పోస్ట్ చేస్తూ వారిని మైమరిపిస్తూ ఉంటుంది. తాజాగా ఈ అమ్మడు మెక్సీకో టూర్లో ఉంది. అక్కడ ఓ బ్యూటిఫుల్ లోకేషన్ లో తీయించుకున్న ఫోటో పోస్ట్ చేసింది. అదిరిపోయే కలర్ ఫుల్ బికినీలో ఉన్న ఆమె సముద్రం ఒడ్డున నుంచొని నవ్వులు చిందిస్తోంది. మూడున్నర పదుల వయస్సు దాటేసినా.. ఆమె అందం మాత్రం ఎక్కడా వన్నె తగ్గలేదు.
ఆమె ఫిజిక్ మెయింటినైన్స్ చూస్తేనే అందరూ షాక్ అవ్వాల్సిందే. ఈ ఫోటోకు దీపిక పదుకొనే లాంటి సెలబ్రిటీలు లైకులు కొట్టారు. కేట్.. యువర్ బికినీ ఈజ్ హాట్ అంటూ కొందరు కామెంట్లు పెట్టారు. ఇక కత్రినా సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం అక్షయ్ కుమార్ సినిమా 'సుర్యవంశి' లో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రానికి దర్శకుడు రోహిత్ శెట్టి.