జబర్దస్త్ సక్సస్ వెనుక అసలు వ్యక్తులను పరిచయం చేసిన అనసూయ !

Seetha Sailaja
ఒక కామెడీ షో విమర్శకుల నుండి తీవ్ర కామెంట్స్ ఎదుర్కుని ఏకంగా 5 సంవత్సరాలు ఎటువంటి అంతరాయం లేకుండా టాప్ రేటింగ్స్ తో ప్రసారం కావడం అంత సులువైన పనికాదు. ఈ కార్యక్రమం ద్వారా ఎందరో కమెడియన్స్ ఫిలిం ఇండస్ట్రీకి పరిచయం కావడమే కాకుండా కొందరు కమెడియన్స్ ఖరీదైన ఆస్తులు కూడ కొనుక్కున్నారు అంటే ఈకార్యక్రమం ఎంతోమందికి క్రేజ్ తో పాటు జీవితాన్ని ఇచ్చింది అని అర్ధం చేసుకోవచ్చు. 

ఈ కార్యక్రమం 5 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా యాంకర్ అనసూయ పెట్టిన ట్విట్ ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ ఐదేళ్ళలో తనను ఈ కార్యక్రమం ద్వారా ఆదరించిన బుల్లితెర ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమం సక్సస్ కు ప్రధాన కారకులు అయిన ప్రోగ్రామ్ డైరెక్టర్స్ నితిన్ భరత్ లను పరిచయం చేయడమే కాకుండా ఈ కార్యక్రమం ఈవిధంగా సక్సస్ కావడానికి కేవలం వారిద్దరే కారణం అంటూ వారిద్దరిపై ప్రశంసలు కురిపించింది. 

అయితే ఈ ట్విట్ పై కొందరు అనసూయను ప్రశంసిస్తూ ఉంటే మరికొందరు మాత్రం విమర్శలు చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని వెనక ఉండి నడిపించిన నితిన్ భరత్ ల కృషి గురించి అనసూయ ప్రస్తావించడం బాగానే ఉన్నా ఈ కార్యక్రమ మూలస్తంభాలుగా కొనసాగిన నాగబాబు రోజాల గురించి అనసూయ ఒక్క మాట తన ట్విట్ లో చెప్పి ఉంటే బాగుండేది అంటూ కొందరు మెగా అభిమానులు ఆమెను సున్నితంగా విమర్శిస్తున్నారు.

ఇదే సందర్భంలో అనసూయ ఈ కార్యక్రమం మరో 50 సంవత్సరాలు కొనసాగాలి అంటూ చేసిన ట్విట్ ను చూసి మరికొందరు ఈ రాబోతున్న 50 సంవత్సరాలు కూడ బుల్లితెర ప్రేక్షకులు అనసూయ రష్మి లను చూడాలా అంటూ మరికొందరు జోక్ చేస్తున్నారు. అంతేకాదు ఈమధ్య అనసూయ ‘జబర్దస్త్’ కార్యక్రమం నుండి తప్పుకుంటోంది అని వార్తలు వచ్చిన నేపధ్యంలో తాను ‘జబర్దస్త్’ కార్యక్రమాన్ని విడిచి ఎక్కడకు వెళ్ళడం లేదు అని పరోక్షంగా తెలియ చేయడానికి అనసూయ ఇలా హడావిడి చేసి ఉంటుంది అంటూ మరికొందరు సెటైర్లు వేస్తున్నారు.. 
 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: