ఆర్ ఆర్ ఆర్ మార్కెట్ కోసం రాజమౌళి వ్యూహాత్మక లీకులు !

Seetha Sailaja
‘బాహుబలి’ మించి రికార్డు సాధించాలి అన్న టెన్షన్ రాజమౌళికి ‘ఆర్ ఆర్ ఆర్’ విషయంలో చాల ఎక్కువగా ఉంది. దీనితో ఈ కథ విషయమై అనేక సార్లు మార్పులు చేర్పులు చేయడమే కాకుండా ఈమూవీ నటీనటుల ఎంపిక విషయంలో రాజమౌళి చాల ఎక్కువగా కన్ఫ్యూజ్ అవుతున్నాడు అన్న కామెంట్స్ ఇప్పటికే ఇండస్ట్రీ వర్గాలలో హడావిడి చేస్తున్నాయి. 

దీనికితోడు ఈసినిమా మార్కెట్ కు సంబంధించి బయ్యర్ల నుండి వస్తున్న ఆఫర్ల విషయంలో రాజమౌళికి దానయ్యకు అభిప్రాయభేదాలు ఏర్పడ్డాయి అన్న గాసిప్పులు ఇప్పటికే ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారాయి. ఈ సినిమా మేకింగ్ పూర్తి అయిన తరువాత మాత్రమే మార్కెట్ చేయాలి అన్న రాజమౌళి పట్టుదల చిట్టచివరకు నెగ్గినట్లు తెలుస్తోంది.

ఇలాంటి పరిస్థుతులలో ఈమూవీ ఇంటర్వెల్ ఎపిసోడ్ కు సంబంధించి బయటకు వదులుతున్న లీకులు కూడ ఈమూవీ మార్కెట్ ను భారీ స్థాయిలో చేయాలి అన్న ఆలోచనలతోనే అని అంటున్నారు. ప్రస్తుతం బయటకు వస్తున్న లీకుల ప్రకారం ఈమూవీ ఇంటర్వెల్ ముందు వచ్చే భారీ వార్ సీన్ కోసం దాదాపు 45 కోట్లు ఖర్చు పెడుతున్నట్లు సమాచారం. 

ఒక వార్ ఎపిసోడ్ కు సంబంధించి సుమారు 2 వేలమంది జూనియర్ ఆర్టిస్టులను బ్రిటీష్ సోల్జర్స్ గా మార్చి వారితో చరణ్ జూనియర్ లు చేయబోయే యుద్ధం సీన్ తో ఈమూవీకి ఇంటర్వెల్ గ్యాప్ ఇవ్వాలి అని తలుస్తున్న రాజమౌళి ఆలోచనలు ఇప్పుడు బయటకు  రావడం వెనుక రాజమౌళి వ్యూహాలు బయటపడుతున్నాయి. జక్కన్న చెప్పే ఏరియా రెట్లు బయ్యర్లు మరొక మాట మాట్లాడకుండా కొనడానికి  ఇలా ఈ వార్ సీన్ చిత్రీకరణ పూర్తి కాకుండానే బయటకు లీకులు వదులుతున్నారు అంటూ ఇండస్ట్రీ లోని కొందరు రాజమౌళి ఆలోచనలకు షాక్ అవుతున్నారు..    


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: