యాంగ్రీ యంగ్ మెన్ రాజశేఖర్ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో
తెరకెక్కిన సినిమా కల్కి. జూన్ 28 వ తేదీన రిలీజ్ కాబోతున్నది. ఇప్పటికే
రిలీజైన ప్రచార చిత్రాలు ఆకట్టుకున్నాయి. మొదట ఈ సినిమాను జులై లేదా
ఆగష్టులో రిలీజ్ చేయాలనీ అనుకున్నారు.
ఏమైందో
తెలియదు సడెన్ గా ప్రీ ఫోన్ చేసుకొని జూన్ 28 వ తేదీన రిలీజ్ చేస్తున్నట్టు
ప్రకటించారు. ఈ ప్రకటన ఎందుకు చేశారో తెలియదుగాని, సినిమా రిలీజ్ డేట్
ప్రకటించిన కొద్దిసేపటికి శ్రీ విష్ణు బ్రోచేవారెవరురా మూవీని కూడా జూన్ 28
వ తేదీన రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నట్టు ప్రకటించారు.
ఈ
సినిమాపై హోప్స్ ఉన్నాయి. శ్రీ విష్ణు తో పాటు, నివేత థామస్ హీరోయిన్ గా
చేస్తోంది. ఈ రెండు సినిమాలతో పాటుగా అదే రోజున ఆది బుర్రకథ కూడా రిలీజ్
కాబోతున్నది. డైమండ్ రత్నబాబు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై క్రేజ్
పెరిగింది.
జూన్ 28 న అనుకుంటున్న మూడు
సినిమాలు వేరువేరుగా పాజిటివ్ బజ్ క్రియేట్ కావడంతో.. సినిమా ఎలా ఉంటుందో
అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మూడు బాగున్నాయి అని తెలిస్తే... మంచి
వసూళ్లు వస్తాయి. ఏదైనా తేడా కొడితే మాత్రం మరుసటి రోజే దుకాణం
సర్దేయాల్సిందే.