చైనా వెళ్తోన్న చిట్టి-2..ది రోబోట్
సూపర్ స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన 2.ఓ ఇండియాలో భారీ అంచనాల నడుమ విడుదలైన వాటిని అందుకోవడంలో నూరుశాతం సక్సెస్ సాధించలేదు. 500 కోట్ల తో పెట్టుబడితో తెరకెక్కించిన సినిమా 2000 కోట్ల భారీ టార్గెట్ తో బరిలోకి దిగినా టార్గెట్ మిస్ అయింది. కేవలం 700 కోట్ల వసూళ్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇక తెలుగు నిర్మాతలకైతే చిట్టి నష్టాలనే మిగిల్చింది. తాజాగా 2.ఓ చైనాలో లో సునామీ సృష్టించడానికి రెడీ అవుతోంది. జూన్ 12న రిలీజ్ చేయడానికి ముమూర్తం ఫిక్స్ చేసేసారు.
దాదాపు 5600 స్ర్కీన్లలో రిలీజ్ చేయనున్నట్లు కొద్దిసేపటి క్రితమే తెలిపారు. దీంతో అక్కడ ఎలాటి ఫలితాలు సాధిస్తోందనని మేకర్స్ సహా అభిమానుల్లో ఉత్కంఠత నెలకొంది. హాలీవుడ్ తర్వాత చైనా మార్కెట్ అతి పెద్దది. ఎన్నో హాలీవుడ్ సినిమాలు చైనా లో కోట్లవసూళ్లను సాధించాయి. ఇటీవల విడుదలైన అవెంజర్స్, అంతకు ముందు అమీర్ ఖాన్ దంగల్ సినిమాలు అక్కడ రికార్డు వసూళ్లను సాధించాయి. అలాగని సూపర్ స్టార్ ఏమీ తక్కువోడు కాదు. చైనాలో సూపర్ స్టార్ కు ప్రత్యేకమైన అభిమానం గణం ఉంది. గతంలో ఆయన నటించిన ఎన్నో సినిమలు అక్కడ విడుదలై సంచలన విజయాలు నమోదు చేసాయి.
రోబో చైనాలో ఏ స్థాయి వసూళ్లను సాధించిందో తెలిసిందే. అంతకు ముందు సినిమాలు సూపర్ స్టారర్ను ఎన్నోసార్లు సర్ ప్రైజ్ చేసాయి. ఇండియన్ సినిమా హీరోలలో చైనా లో అతి పెద్ద మార్కెట్ ఉన్న ఏకైక హీరో కూడా రజనీనే. అంతటి క్రేజీ స్టార్ సినిమా అక్కడ రిలీజ్ అవుతుందంటే వ్యవహారం ఆషామాషీగా ఉండదు. మరి భారీ అంచనాల నడుమ విడుదలవుతోన్న `2.ఓ` ఆ అంచనాలను అందుకుంటుందో? లేదో? చూడాలి. ప్రస్తుతం రజనీ కాంత్ మురుగదాస్ దర్శకత్వంలో దర్బార్ లో నటిస్తోన్న సంగతి తెలిసిందే.