అన్నపూర్ణ స్టూడియోస్ పై తీసే సినిమాలలో అక్కినేని కుటుంబ సభ్యులు అందరికి లాభాలలో వాట ఉండే విధంగా అక్కినేని జీవించి ఉన్నరోజులలో ఒక నిర్ణయం తీసుకున్నాడని అంటారు. అయితే ఆ కుటుంబ సభ్యులలో అన్నపూర్ణ స్టూడియోస్ వ్యవహారాలూ అన్నీ నాగార్జున మాత్రమే చూస్తూ ఉంటాడు.
అక్కినేని చనిపోయిన తరువాత నాగార్జున ‘మనం’ ఎంటర్ టైన్మెంట్స్ అన్న బ్యానర్ క్రియేట్ చేసి ఆ పేరు మీద సినిమాలు తీస్తూ ఆసినిమాలలో వచ్చే లాభాలలో కేవలం పదోవంతు రాయల్టీని మాత్రమే అన్నపూర్ణా స్టూడియోస్ కి ఇస్తున్నాడు అనే గాసిప్పులు కూడ ఉన్నాయి. ఇప్పుడు ఇదే పద్ధతి అనుసరిస్తూ సమంత నాగచైతన్యలు కలిసి వేరుగా మరొక ప్రొడక్షన్ హౌస్ పెడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఈ ప్రొడక్షన్ హౌస్ వ్యవహారాలు అన్నీ స్వయంగా సమంత పర్యవేక్షణలో కొనసాగుతాయి అని అంటున్నారు. మంచి కథలను ఎంచుకుని చిన్న హీరోలతో సినిమాలు తీసే ప్లాన్ సమంత అమలుచేస్తున్నట్లు తెలుస్తోంది. కొత్త కాన్సెప్ట్ సినిమాలు తీయడానికి కొత్త ఆలోచనలని ఎంకరేజ్ చేస్తూ బయటి వారిని హీరోలుగా తీసుకోవడానికి ఉమ్మడి సంస్థల నిర్ణయాలు ఇబ్బందిగా మారుతున్న పరిస్థితులలో సమంత ఈనిర్ణయం తీసుకుంది అని అంటున్నారు.
తెలుస్తున్న సమాచారం మేరకు 10 కోట్ల లోపు తీసే చిన్న సినిమాలనుంచి తామిద్దరం కలిసి నటించే చిత్రాల వరకు ఇందులో చేయాలనే తన ఆలోచనలను సమంత నాగార్జున ముందు పెట్టి అతడి అంగీకారం కోరినట్లుటాక్. అయితే ప్రస్తుతానికి నాగ్ ఈ కొత్త ప్రొడక్షన్ హౌస్ విషయమై తన నిర్ణయం చెప్పకుండా సమంత చైతుల ఆలోచనలకు తాత్కాలికం గా బ్రేక్ వేసినట్లు తెలుస్తోంది. నాగార్జున అంగీకరిస్తే ఈ బ్యానర్‌పై తొలి సినిమా త్వరలోనే తెర మీదకి వస్తుందని అంటున్నారు..