గత వారం విడుదలైన ‘ఫలక్ ను మా దాస్’ మూవీకి మీడియా వర్గాల రేటింగ్స్ సరిగ్గా రాకపోవడంతో యంగ్ హీరో విశ్వక్ సేన్ తన సినిమా పై విమర్శలు చేసిన విమర్శకులను టార్గెట్ చేస్తూ చేసిన కామెంట్స్ లో అనేక బూతులు దొర్లడం ఇండస్ట్రీ వర్గాలను షాక్ కు గురి చేసింది. ఈసినిమాకు మీడియా రేటింగ్స్ చాల తక్కువ రావడంతో అసహనానికి లోనైన ఈ యంగ్ హీరో తన సినిమాను అర్ధం చేసుకోలేకపోయిన విమర్శకులను టార్గెట్ చేస్తూ కొన్ని అసభ్యకరమైన మాటలను వదిలాడు.
అంతేకాదు తాను త్వరలో హైదరాబాద్ లో ఈమూవీ సక్సస్ మీట్ ను ఏర్పాటు చేసి తన సినిమాను టార్గెట్ చేసిన వారి పని పడతాను అంటూ షాకింగ్ కామెంట్స్ చేసాడు. ఇప్పుడు ఈ కామెంట్స్ వైరల్ గా మారి విశ్వక్ సేన్ పై ఎదురుదాడి మొదలైంది. దీనితో ఎలర్ట్ అయిన విశ్వక్ సేన్ తన మాటల స్పందిస్తూ తన మాటలను తప్పుగా అర్ధం చేసుకున్నారని వివరణ ఇచ్చాడు.
అంతేకాదు తాను అన్న మాటలు అన్నీ కేవలం ఆవేశంతో చేసిన కామెంట్స్ మాత్రమే అనీ తాను ఎవరినీ కించపరచడానికి ఎలాంటి బూతు పదాలు వాడలేదు అంటూ యూటర్న్ తీసుకున్నాడు. అంతేకాదు తన సినిమాకు కలక్షన్స్ బాగున్నాయని ముఖ్యంగా ఆంధ్రా ప్రాంతంలో ఈసినిమాను చూస్తూ యూత్ మరో అర్జున్ రెడ్డి అని అంటున్నారని చెపుతూ తన మూవీ ఫెయిల్ కాదు అన్న సంకేతాలు ఇస్తున్నాడు.
ఇది ఇలా ఉండగా ఈమూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో ఈసినిమాను ఆకాశంలోకి ఎత్తేస్తూ నాని చేసిన కామెంట్స్ పై కూడ చర్చలు జరుగుతున్నాయి. భయంకరమైన బూతు డైలాగ్స్ ఉన్న ఈమూవీ అందరికీ నచ్చుతుంది అంటూ నాని ఎందుకు ఈసినిమాను ప్రమోట్ చేసి తన మాట విలువను తగ్గించుకున్నాడు అంటూ మరికొందరు జోక్ చేస్తున్నారు..