పవన్ ప్రస్తావన పై మీడియా నుండి ఎస్కేప్ అయిన అలీ !

Seetha Sailaja
ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ అలీల మధ్య ఏర్పడిన గ్యాప్ ఓపెన్ సీక్రెట్. ఆతరువాత ఎన్నికల వచ్చిన ఫలితాలు వచ్చిన తరువాత అలీ మీడియా ముందుకు ఎప్పుడు రాలేదు. దీనితో పవన్ ఓటమి పై అలీ స్పందన ఏమిటి అన్న విషయం ఎవరికీ తెలియలేదు.  

అయితే ఇప్పుడు ఈరోజు విజయవాడలో జరిగిన జగన్ ప్రమాణస్వీకార మహోత్సవాన్ని చూడటానికి అలీ రావడమే కాకుండా కొద్ది సేపు మీడియా వర్గాలతో మాట్లాడాడు. పులివెందుల ముద్దు బిడ్డ  జగన్మోహన్ రెడ్డి అంటూ ప్రశంసలు కురిపించాడు. అంతేకాదు ఆంద్రప్రదేశ్ ప్రజల కోరికలు నెరవేరే అవకాసం ఈనాటితో వచ్చింది అంటూ జగన్ పై తనకున్న అభిమానాన్ని తెలియచేసాడు.

ఇంటికి నవ ధాన్యాలు ఎంత అవసరమో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త రాజధానికి నవరత్నాలు అంతే అవసరం అంటూ .మొదటి సంతకం నవరత్నాల పదకం మీద జగన్ పెడుతున్న సందర్భంలో ఆయన పై అలీ ప్రశంసలు కురిపించాడు.  అయితే మాటల మధ్య ఒక మీడియా సంస్థ ప్రతినిధి పవన్ ప్రస్తావన తీసుకు రావడానికి ప్రయత్నించినా ఆమాటలకు అవకాసం ఇవ్వకుండా అలీ వడివడిగా నడిచి వెళ్ళిపోయినట్లు తెలుస్తోంది. 

దీనితో అలీ చాల తెలివిగా వ్యవహరించాడు అన్న కామెంట్స్ వస్తున్నాయి. ఇప్పటికే పవన్ అభిమానుల టార్గెట్ లో ఉన్న అలీ ఏమి మాట్లాడినా ఆ విషయాలు పవన్ అభిమానులకు నెగిటివ్ గా కనిపిస్తాయి కాబట్టి అలీ తన మాటలలో పొడుపు పాటించి వివాదాలాక్ చెక్ పెట్టాడు అనుకోవాలి..  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: