విజయ్ దేవరకొండ ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోతున్న శివ నిర్వాణ !

Seetha Sailaja
సెన్సిబుల్ డైరెక్టర్ గా పేరుగాంచిన శివ నిర్వాణకు ‘మజిలీ’ మూవీ ద్వారా విపరీతమైన ప్రశంసలు లభించినా అతడికి ఆసినిమా కొత్త అవకాశాలు తెచ్చిపెట్టే విషయంలో పెద్దగా సహకరించలేదు అన్న కామెంట్స్ వస్తున్నాయి. ఈమూవీని టాప్ యంగ్ హీరోలు అందరు ప్రశంసించారు కాని ఈ దర్శకుడు సినిమాలలో నటించే విషయంలో పెద్దగా ముందుకు రావడం లేదు అన్న వార్తలు వస్తున్నాయి. 

ఇలాంటి పరిస్థుతులలో శివ నిర్వాణ విజయ్ దేవరకొండను దృష్టిలో పెట్టుకుని వ్రాసిన కథ ఆ హీరోకి నచ్చినా విజయ్ చెప్పిన విధంగా మార్పులు శివ నిర్వాణ చేయలేకపోతున్నాడు అని టాక్. దీనితో విజయ్ తో చేసే సినిమా అవకాసం వచ్చినా కూడ ఈ యంగ్ డైరెక్టర్ పూర్తిగా వినియోగించలేకపోతున్నాడు అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. 

దీనితో ఈ యంగ్ డైరెక్టర్ పరిస్థితి కూడ దర్శకుడు సుకుమార్ లా మారిపోయిందా అంటూ కొందరు సందేహాలు వ్యక్తపరుస్తున్నారు. సుకుమార్ ‘రంగస్థలం’ ను ప్రశంసించిన టాప్ హీరోలు అంతా సుకుమార్ తో సినిమాలు చేయడానికి వెనకడుగు వేస్తున్నారు. 

ఇప్పుడు శివ నిర్వాణ పరిస్థితి కూడ సుకుమార్ లానే కొనసాగుతూ ప్రశంసలు వస్తున్నాయి కానీ అవకాశాలు రావడం లేదు. దీనితో ఈ యంగ్ డైరెక్టర్ తిరిగి నాని వైపు చూస్తున్నా ఇప్పుడు ఉన్న పరిస్థుతులలో నాని మరొక సంవత్సరం వరకు ఖాళీ లేడు. దీనితో శివ నిర్వాణ కథకు హీరో ఎవ్వరు అంటూ ఇండస్ట్రీ వర్గాలలో ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి..   



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: