జగన్ బయోపిక్ పై తన అభిప్రాయాన్ని వెల్లడించిన సూర్య !

Seetha Sailaja
విలక్షణ నటుడుగా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న కోలీవుడ్ హీరో సూర్యాకు టాలీవుడ్ ప్రేక్షకులలో కూడ చాలామంది అభిమానులు ఉన్నారు. ఇలాంటి నేపధ్యంలో ఈవారం విడుదల కాబోతున్న ‘ఎన్ జి కె’ మూవీని ప్రమోట్ చేస్తూ ఒక ప్రముఖ తెలుగు దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జగన్ బయోపిక్ కు సంబంధించి వస్తున్న వార్తల పై ఆ సక్తికర కామెంట్స్ చేసాడు. 

తన ప్రియమిత్రుడు జగన్ మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కాబోతున్నందుకు తాను పడుతున్న ఆనందాన్ని వివరిస్తూ జగన్ పై ప్రస్తుతం హిమాలయ శిఖరం అంత బరువు ఉందని ఆ సవాళ్ళు ఎదుర్కోవడానికి జగన్ చాల శ్రమించవలసి ఉంటుంది అని అంటూ తన ప్రియమిత్రుడు విజయం సాధించాలి అన్న తన కోరికను బయటపెట్టాడు. ఇదే సందర్భంలో జగన్ బయోపిక్ గురించి వస్తున్న వార్తల పై స్పందిస్తూ మహీ వి. రాఘవ తీయబోతున్న ‘యాత్ర 2’ లో జగన్ పాత్రకోసం తనను సంప్రదించారు అని వస్తున్న వార్తలలో నిజం లేదనీ అయితే ఆవార్త నిజం అయితే బాగుండును అని తాను కోరుకుంటున్నట్లు తన కోరికను బయటపెట్టాడు. 

ప్రస్తుతం తన ఆలోచనలు అన్నీ ఈవారం విడుదల కాబోతున్న ‘ఎన్ జి కె’ సినిమా చుట్టూ ఉన్నాయని ఈసినిమా అందరికీ నచ్చుతుంది అన్న తన అంచనాలను బయటపెట్టాడు. ఇక త్రివిక్రమ్ తో తాను ఒక డైరెక్ట్ తెలుగు సినిమా చేసే చర్చలు జరుగుతున్నాయని త్రివిక్రమ్ కథ రెడీ పెట్టగానే తాను ఆ ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతున్న విషయాన్ని తెలియ చేసాడు. 

తాను ఇండస్ట్రీకి వచ్చి ఎన్నో సంవత్సరాలు అయిపోయి నటుడుగా తనకంటూ గుర్తింపు వచ్చినా తాను షూటింగ్ కు వెళ్ళే ప్రతిరోజు తాను నటించబోయే సీన్ గురించి తెగ టెన్షన్ పడతానని ఒకొక్క దర్శకుడు తీరు ఒకోలా ఉంటుంది కాబట్టి వారిని మెప్పించే స్థాయిలో నటించడం ఇప్పటికీ ఒక సవాల్ గా ఫీల్ అవుతాను అంటూ తన నటన పట్ల కమిట్మెంట్ ను తెలియచేసాడు. ఏ స్టార్ అయినా తనకు ఏదీ తెలియదు అని అనుకుంటూ నటించినప్పుడు మాత్రమే సక్సస్ అవుతారు అంటూ సూర్య చెపుతున్న మాటలు నేటి యంగ్ హీరోలకు ఒక పాఠం అనుకోవాలి..    



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: