నిన్న విడుదలైన ‘ఎబిసిడి’ అల్లు శిరీష్ కు ఏమాత్రం జోష్ ను ఇచ్చే పాజిటివ్ టాక్ ఇవ్వలేకపోయింది. దీనితో శిరీష్ ఈమూవీ పై పెట్టుకున్న ఆశలు అన్నీ అడియాసలుగా మారిపోయాయి. ఈ మధ్య విడుదలైన ‘మజిలీ’ ‘జెర్సీ’ లతో పాటు లేటెస్ట్ గా విడుదలైన ‘మహర్షి’ కూడ సీరియస్ సినిమాలు కావడంతో అల్లు శిరీష్ తన ‘ఎబిసిడి’ తో నవ్వించగలడేమో అని అందరు భావించారు.
అయితే అనూహ్యంగా మళయాళంలో సూపర్ హిట్ అయిన ఈమూవీకి కనీసం ఎవరేజ్ టాక్ కూడ రాకపోవడం ఒక విధంగా శిరీష్ కు కోలుకోలేని దెబ్బ. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం సమ్మర్ హాలిడే ట్రిప్ లో ఉన్న బన్నీ ‘ఎబిసిడి’ మూవీ విడుదల సందర్భంగా ఆమూవీ విజయం సాధించాలి అంటూ కనీసం నిన్న ఒక్క ట్విట్ కూడ చేయకపోవడం చాలామందిని ఆశ్చర్య పరచడమే కాకుండా అసలు శిరీష్ కు అల్లు కాంపౌండ్ సపోర్ట్ లేదా అన్న సందేహాలు కలిగేలా చేస్తోంది.
అల్లు అర్జున్ స్విజర్లాండ్ లో తన భార్య పిల్లలతో ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను షేర్ చేయడానికి తీరికగా ఉంటే కనీసం తన తమ్ముడు సినిమా విజయం సాధించాలి అంటూ అభినందనలు తెలపకపోవడం వెనుక కారణాలు ఏమిటి అన్నకోణంలో కూడ చర్చలు జరుగుతున్నాయి. మరికొందరైతే అల్లు అరవింద్ మోహన్ బాబు లా తన పిల్లల పై ప్రయోగాలు చేస్తూ సినిమాలు తీసి నష్టపోయే మనస్తత్వం ఉన్న వ్యక్తి కాదనీ అందువల్లనే బయట బ్యానర్లతో శిరీష్ తో సినిమాలు తీయించి అవి సక్సస్ అయితే ఆతరువాత అరవింద్ శిరీష్ తో వరసగా సినిమాలు తీసే పనిచేపడతాడు అంటూ జోక్ చేస్తున్నారు.
ఏది ఏమైనా పట్టువదలని విక్రమార్కుడులా సినిమాలు చేస్తూ శిరీష్ తన సినిమా వారసత్వాన్ని అతడు నటించిన సినిమాల జయాపజయాలతో సంబంధం లేకుండా అనుసరిస్తున్న వ్యూహాలు అతడి మనో నిబ్బరాన్ని సూచిస్తున్నాయి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. దీనితో శిరీష్ కు సూపర్ హిట్ సినిమాలో నటించాలి అనే కల మరొకసారి వాయిదా పడింది..