థ్రిల్లర్ నేపథ్యంలో నయనతార ‘ఐరా’డేట్ వచ్చేసింది!

Edari Rama Krishna
తెలుగు, తమిళ ఇండస్ట్రీలో నెంబర్ వన్ రేస్ లో ఉన్న హీరోయిన్ నయనతార.  కెరీర్ ప్రారంభించిన ఇప్పటికీ పద్నాలు  సంవత్సరాలు దాటుతున్నా..ఇంకా గ్లామర్ మెయింటేన్ చేస్తూనే ఉంది. ఓ వైపు స్టార్ హీరోల సరసన నటిస్తూనే లేడీ ఓరియెంటెడ్ పాత్రల్లో నటించి మెప్పిస్తుంది.  తాజాగా తమిళంలో నయనతార  'ఐరా' చిత్రంలో నటిస్తుంది. ఈ చిత్రంలో నయన్ రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించనున్నదని సమాచారం.

ఈ అంశమే ఈ చిత్రానికి  ప్రత్యేక ఆకర్షణగా మారింది.  తమిళంలో ఈ చిత్రం విడుదలకి ముహూర్తం ఖరారైపోయింది.  మార్చి 28వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. తెలుగు లో కూడా ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి సిద్దమవుతున్నట్లు సమాచారం. త్వరలోనే తెలుగు వెర్షన్ విడుదల తేదీని ప్రకటించనున్నారు.

నయనతారకి ఈ చిత్రం మరో భారీ విజయాన్ని అందించడం ఖాయమనే మాట కోలీవుడ్లో బలంగా వినిపిస్తోంది. గత కొంత కాలంగా విభిన్నమైన కథలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ వెళుతోంది. ఇలా అన్ని వైపుల నుంచి నయనతార తన జోరును కొనసాగిస్తూ ఫుల్ బిజీగా వుంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: