అమ్మాయిలు సెక్స్ గురించి మాట్లాడితే తప్పేంటి..?

Chakravarthi Kalyan

అమ్మాయిలు సెక్స్ గురించి మాట్లాడితే తప్పేంటి అంటోంది హీరోయిన్ తమన్నా.. ఇంకా మనం ఏ కాలంలో ఉన్నాం.. అమ్మాయిలు సెక్స్ గురించి కానీ.. సెక్సువల్ విష‌యాలు కానీ మాట్లాడితే తప్పుగా ఎందుకు అర్ధం చేసుకుంటారని ప్రశ్నిస్తోంది. ఇలాంటి విషయాలు అబ్బాయిలు మాట్లాడితే మాత్రం తప్పుపట్టరేం అని నిలదీస్తోంది.



అమ్మాయి అనేసరికి బోలెడన్ని తప్పులు వెదుకుతారు? ఏదైనా విషయాన్ని స్వేచ్ఛగా మాట్లాడే హక్కు అమ్మాయిలకు ఇప్పటికీ లేదని వాపోతోందీ మిల్కీ బ్యూటీ. ఇప్పటికీ అమ్మాయిల డ్రెస్సింగ్ బట్టీ ఆ అమ్మాయి మనస్తత్వాన్ని అంచనా వేస్తున్నారు. ఇది చాలా తప్పు కదా అంటోంది తమన్నా. తమకు నచ్చినట్టు ఉండే హక్కు, మాట్లాడే స్వాతంత్ర్యం అమ్మాయిలకు ఇవ్వాలంటోంది



ఇప్పుడివన్నీ తమన్నా ఎందుకు మాట్లాడుతోందంటున్నారా.. ఆ మధ్య తమన్నా నెక్స్ట్ ఏంటి.. అనే బోల్డ్ సినిమా చేసింది కదా. కానీ ఆ సినిమా అంతగా ఆడలేదు. కానీ ఆ సినిమా ద్వారా తాను చాలా తెలుసుకున్నానంటోంది తమన్నా. థియేటర్‌కి వచ్చిన ప్రేక్షకుల చేత కన్నీరు పెట్టించకూడదంటున్న తమన్నా.. ఈ సినిమా ఆలోచింపజేస్తోందన్నారు.



ఐతే.. ఈ సినిమా ఆఫర్ వచ్చిన మొదట్లో తానూ అలాగే అనుకుందట. స్క్రిప్టు చదివిన తర్వాత ‘ఇంత బోల్డ్‌గా ఉందేంటి’ అని ఫీలైందట. కానీ ఆ తర్వాత ఇదంతా కామనే కదా.. సినిమాలో ఎందుకు ఉండకూడదని అని అనిపించిందట. ప్రేమ, సెక్స్‌ చాలా సహజమైన విషయాలే కానీ తెరపై ఓ పాత్ర ద్వారా పలికిస్తే షాకింగ్‌గా అనిపిస్తుంది.. ఏంటో అంటోందీ అమ్మడు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: