ఈ బాలీవుడ్ లో వస్తున్న చిత్రాలు రిలీజ్ కి ముందు వివాదాలు చుట్టుముడుతున్నాయి. ఆ మద్య సంజయ్ లీలా బన్సాలీ, దీపికా పదుకొనె కాంబినేషన్ లో వచ్చిన ‘పద్మావత్’ చిత్రంపై కర్ణిసేన తిరుగుబాటు చేసింది. ఈ చిత్రం రిలీజ్ అడ్డుకుంటూ భారత దేశ వ్యాప్తంగా ఆందోళన చేపట్టింది. మొత్తానికి అన్ని క్లియర్ చేసుకొని థియేలర్లో రిలీజ్ అయిన తర్వాత ఈ చిత్రాన్ని ఆకాశానికి ఎత్తారు కర్ణిసేన. ఇప్పుడు ఇదే పరిస్థితి 'మణికర్ణిక' కు వచ్చింది. క్రిష్ దర్శకత్వంలో కంగనా రౌనత్ ముఖ్య పాత్రలో నటించిన 'మణికర్ణిక' ఇప్పుడు దేశ వ్యాప్తంగా వివాదంగా మారింది.
ఈ చిత్రాన్ని మొదట క్రిష్ దర్శకత్వం వహించిన మద్యలోనే వైతొలిగారు. దాంతో మిగతా భాగం మొత్తం కంగనా రౌనత్ దర్శకత్వం వహించింది. వీరిద్దరు సంయుక్తంగా దర్శకత్వం వహించిన 'మణికర్ణిక' రేపు ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ చిత్రంలో ఝాన్సీ లక్ష్మీబాయ్ ని తప్పుగా చూపించారంటూ మహారాష్ట్రకు చెందిన కర్ణిసేన బాంబే హైకోర్టులో పిటిషన్ వేసింది.
ఈ పిటిషన్ ను నేడు హైకోర్టు విచారించింది. ఈ చిత్రం రిలీజ్ కి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో రిలీజ్ ని ఆపలేం అని తీర్పును వెలువరించింది. దీనికితోడు, కర్ణిసేన చేసిన ఆరోపణలకు సంబంధించి రెండు వారాల్లోగా వివరణ ఇవ్వాలంటూ దర్శకనిర్మాతలను ఆదేశించింది. ప్రపంచ వ్యాప్తంగా 50 దేశాల్లో 'మణికర్ణిక' విడుదల కాబోతోంది.