సన్నీలియోన్ కోరిక తీర్చబోతున్న సౌత్‌ సూపర్‌ స్టార్..?

Chakravarthi Kalyan
సన్నీలియోన్‌ అంటే కుర్రకారుకు ఎంతో క్రేజ్ అన్న సంగతి తెలిసిందే. అందుకే ఆమెతో స్పెషల్ సాంగ్స్ చేయించాలని నిర్మాతలు పోటీపడుతున్నారు. ఇప్పటికే ఈ హాట్ భామ ఎన్నోఐటమ్ సాంగ్స్ తో అదరగొట్టింది కూడా. సన్నీ స్టెప్పులకు యూత్ హార్డ్ బీట్ పెరుగుతుంది.


ఇప్పుడు ఈ హాట్ బేబీ సౌత్‌లో మరో ఐటమ్ సాంగ్స్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ప్రముఖ మళయాళ సూపర్ స్టార్ మమ్మిట్టి పక్కన ఈ ముద్దుగుమ్మ చిందులేయబోతోందట. మన్యంపులి దర్శకుడు వైశాక్ దర్శకత్వంలో మమ్ముట్టీ హీరోగా నటిస్తున్న సినిమాలో సన్నీ ఐటమ్‌ సాంగ్ ప్లాన్ చేశారట.


మమ్ముట్టిగారితో ఎప్పటి నుంచో స్క్రీన్ షేర్ చేసుకోవాలని అనుకుంటున్నానని..ఆ కోరిక ఇప్పుడు తీరబోతోందని సన్నీలియోన్ తెగ ఆనందపడిపోతోంది. ఫిబ్రవరిలో ఈ సాంగ్ చిత్రీకరణ కోచిలో ఉంటుందని భావిస్తున్నారు. ఈ సాంగ్ గురించి ఇప్పటికే సన్నీ ప్రాక్టీస్ స్టార్ట్ చేసేసిందట.


మమ్ముట్టి సినిమాలో తన పాట గురించి చాలా గొప్పలు చెప్పుకుంటోందీ హాట్ భామ. ఇదేదో రొటీన్ ఐటమ్‌ సాంగ్ కాదు.. ఈ పాటకు ఈ సినిమాలో చాలా ప్రత్యేకత ఉంది... అంటూ రొటీన్ డైలాగులు వినిపిస్తోంది. మొత్తానికి సన్నీ మంచి ఛాన్స్ కొట్టేసిందన్నమాట.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: