వెంకటేష్ తన జీవితంలో ఈ సంక్రాంతిని మరిచిపోలేడు. ఎవరు ఊహించని విధంగా ‘ఎఫ్ 2’ విడుదలై వారంరోజులు కాకుండానే లాభాలలోకి వచ్చేసింది అన్న వార్తలు ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారాయి. దీనితో పూర్తి జోష్ లోకి వెళ్ళిపోయిన వెంకటేష్ మరింత రెట్టింపు ఉత్సాహంతో మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు.
ఈ ఇంటర్వ్యూలలో వెంకటేష్ ఉత్సాహంగా తన భార్య గురించి కూడ మాట్లాడాడు. ఎప్పుడు తన వ్యక్తిగత విషయాలను బయటకు లీక్ చేయని వెంకటేష్ తన భార్య నీరజ విషయాలను చెపుతూ కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసాడు. తన భార్య తనతో కలిసి ఉంటేనే తాను రెచ్చిపోతానని తన భార్య తన దగ్గర లేకుంటే తనకు యాక్టివ్ నెస్ ఉండదనీ అంటూ తనకు తన భార్యకు మధ్య ఉన్న అండర్ స్టాండింగ్ గురించి వివరంగా చెప్పుకొచ్చాడు.
ప్రతిరోజు సాయంత్రం తాను తన భార్య కోసం కొంత సమయం కేటాయించడమే కాకుండా తరుచు తామిద్దరం కలిసి తమకు నచ్చిన రెస్టారెంట్ కు వెళ్లి నచ్చిన భోజనం చేస్తూ ఉంటాము అన్న విషయాలు బయటపెట్టాడు. అంతేకాదు ‘ఎఫ్ 2’ మూవీలో తన పాత్రను ఎంజాయ్ చేస్తూ అలా నటించడానికి గలకారణం తన భార్య మాత్రమే అంటూ నటనకు సంబంధించి అదేవిధంగా లుక్ కు సంబంధించి కొన్ని సలహాలు ఆమె ఇస్తూ ఉంటుంది అన్న సీక్రెట్ ను బయట పెట్టాడు వెంకటేష్,
‘ఎఫ్ 2’ సినిమాలో వెంకటేష్ ఫస్ట్ హాఫ్ లో వెంకీ చెలరేగిపోయిన తీరు మల్లేశ్వరి-నువ్వు నాకు నచ్చావ్ రోజులని గుర్తుకుతెస్తోందిఅన్న కామెంట్స్ వస్తున్న నేపధ్యంలో ఈమూవీ కలక్షన్స్ చెలరేగిపోతున్నాయి. ప్రస్తుతం వెంకీకి ఏర్పడిన క్రేజ్ తో ఇప్పటికే వెంకటేష్ తో సినిమా తీయాలి అని ప్రయత్నాలు చేస్తున్న త్రివిక్రమ్ అల్లు అర్జున్ తో చేస్తున్న మూవీ పూర్తి అయిన వెంటనే ఖచ్చితంగా వెంకటేష్ తో సినిమా చేస్తానని తన సన్నిహితులతో అంటున్నట్లు సమాచారం..