ముద్దంటేనే భయపడిపోతున్న.. ఆర్‌ఎక్స్ 100 ముద్దుగుమ్మ..?
పాయల్ రాజ్‌పుత్.. ఒక్క సినిమాతోనే పాపులర్ అయ్యింది. ఆర్ ఎక్స్ 100 సినిమాలో పాత్రలో నటించమేంటే చాలు.. జీవించి ఆ సినిమాకు జీవం పోసింది. ప్రత్యేకించి హీరోను రెచ్చగొట్టే దృశ్యాల్లోనూ.. హాట్ హాట్ లిప్ కిస్సుల సీన్లలోనూ రెచ్చిపోయి నటించి సినిమా బంపర్ హిట్ కు కారణమైంది.
ఫస్ట్ సినిమాతోనే అలా రెచ్చిపోతే.. ఇక ముందు ముందు ఇంకెలా ఉంటుందో నన్న టాక్ ఇప్పటికే వచ్చేసింది.. ఆ ఆశతోనే పలువురు నిర్మాతలు ఆమె ఇంటి ముందు క్యూ కడుతున్నారు. కానీ విచిత్రంగా పాయిల్ ఇప్పుడు ముద్దు సీన్ అంటేనే మూతి ముడిచేస్తోందట.
ఏంటీ ఇంతలోనే అంత మార్పు అనుకుంటున్నారా.. అసలు ఫస్ట్ సినిమాలోనే అలాంటి సీన్లంటే చాలా నెర్వస్ గా ఫీలైందట ఈ అమ్మడు. కానీ సినిమా పరంగా తప్పదు అంటే అలా చేయాల్సి వచ్చిందట. అందులోనూ తమది చాలా సాంప్రదాయ కుటుంబం అని చెబుతోందీ పాయల్ రాజ్‌పుత్.
ఇక ముందు ముద్దు సీన్లకు ఓకే చెప్పేది లేదని అంటోంది. చేతిలోకి నాలుగు ఆఫర్లు రాగానే ఇలాంటి కబుర్లు చాలా చెబుతారు అంటూ పాయల్ మాటలు వింటున్న సినీ జనాలు గుసగుసలాడుతున్నారు. మరి ఈ బింకం పాయల్ రాజ్‌పుత్ ఎన్నాళ్లు మెయింటైన్ చేస్తుందో..