దర్శకుడి సెంటిమెంట్ కు ఇలియానా కెరీర్ బలి

Prasad
దేవదాసు సినిమా తో తెలుగు తెరకు పరిచయం అయిన ఇలియానా ఆ సినిమాతోనే యువ ప్రేక్షకుల హృదయాలను దోచుకుంది. ఇక పోకిరి సినిమాతో అగ్రశ్రేణి హీరోయిన్ గా మారింది. రాఖీ, జల్సా, కిక్ వంటి సినిమాలతో స్టార్ హీరోయిన్ గా మారింది. అయితే ఇటీవల కాలంలో ఇలియానా పరిస్థితి ఏం బావులేదు. వరసగా పరాజయాలు పలకరిస్తున్నాయి. జులాయి సినిమా హిట్ అనిపించుకుంటున్నా.. ఇలియానాను పట్టించుకోవడం లేదు. అయితే దేవుడు చేసిన మనుషులు అనే ప్లాప్ సినిమాకు ఇలియానా నే హీరోయిన్ అని గుర్తించుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితులలో ఇలియానా కెరీర్ పుంజుకోవడం కష్టమేనని విశ్లేషకులు భావిస్తున్నారు. అలాగే ఇలియానా తన పారితోషకాన్ని సగానికి తగ్గించుకున్నా ఇలియానాకు చాన్సులు రావడం లేదు. ఇక, ఇలియానా కూడా బాలీవుడ్ సినిమా బర్ఫీ పైనే ఆశలు పెట్టుకుంది. బర్ఫీ సినిమా హిట్టయ్యి తనకి అవకాశాలు వస్తాయని భావిస్తుంది. కాగా, ఇదంతా గమనిస్తున్న వారు ఈ ముద్దగుమ్మ కెరీర్ పై శంకర్ ప్రభావం పడిందని కామెంట్ చేస్తున్నారు. శంకర్ సినిమాలు ఎంత హిట్టయినా అందులో హీరోయిన్ లకు ఎలాంటి ఉపయోగం ఉండదు. పైగా వారి కెరీర్ మసక బారిపోతుంది. ఈ విషయం సదా, శ్రియ ల విషయంలో రుజువైంది. అపరిచితుడులో నటించినా సదాను జనం మరిచిపోయారు. అలాగే శివాజీ లో నటించిన శ్రియకు అటు తమిళంలోనూ, ఇటు తెలుగు లోనూ అవకాశాలు లేక గింజుకుంటుంది. రోబో లో నటించిన ఐశ్వర్య తల్లి అయి సినిమాలకు దూరంగా ఉంటుంది. దీంతో శంకర్ తాజా సినిమా స్నేహితుడులో నటించడంతోనే ఇలియానకు ఇలాంటి స్థితి వచ్చిందని సినీ పరిశ్రమ వర్గాలు కామెంట్ చేస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: