ప్రభాస్ పెళ్ళెప్పుడంటే?
బాహుబలి తో జాతీయ అంతర్జాతీయంగా కీరి ప్రతిష్ఠలు - అభిమానుల్లో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న ప్రభాస్ తన తదుపరి సినిమా "సాహో"తో కూడా అదే స్థాయి హిట్ - కొట్టాలని చూస్తున్నాడు. నిన్న ప్రభాస్ పుట్టిన రోజు కావడంతో సోషల్ మీడియాలో అభిమానులు సహ నటీ నటులు తమ హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు అందించారు.
23 అక్టోబర్ 1979 లో పుట్టిన ప్రభాస్ నిన్నటికి తన 39వ యేళ్ళ వయసుకు చేరిపోయాడు. నాలుగు దశాబ్ధాల సుధీర్ఘ జీవితం పూర్తి చేసుకొని నడి వయసుకు దగ్గరైన ప్రభాస్ పెళ్ళి గురించి ప్రస్తుతం ఒక న్యూస్ మరోసారి (అనేక సార్లు) వైరల్ గా మారింది. ఇది అభిమానులకూ విసుగు కలిగిస్తుంది కూడా!
గతంలో ఆయన పెళ్లి గురించి అనేక వార్తలు, అనేక మందితో ఫిక్స్ అయినట్లు సోషల్ మీడియా పుకార్లు షికారు చేసిన సంగతి జగమెరిగినదే. అయితే ఇప్పుడు మళ్ళీ ఆయన మ్యారేజ్ గురించి మరో టాక్ వస్తోంది. అమ్మాయిది గుంటూరట. గుంటూరైనా గోంగూరైనా అభిమానులు కోరేది ఆయనగారి పెళ్ళి మాత్రమే.
ప్రభాస్ నాలుగు పదుల వయసు లోకి అడుగు పెట్టక ముందే పెళ్లి చేసేయాలని కుటుంబ సభ్యులు "స్ట్రాంగ్ గా ఫిక్స్" అయ్యారట. వీళ్ళు ఫిక్సైతే ఆయన వినొద్దూ! గతంలోనే కృష్ణం రాజు ప్రభాస్ ఏమైనా చిన్న పిల్లాడా? అతనికి తెలియదా? మేమూ చెప్పి చూశామని విసుక్కున్నారు. అంతటి ‘కూల్ రాజు’ గారికే మనోడు మంటెత్తించాడు .
అంటే ప్రభాస్ పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడటం లేదని చక్కగా అర్థమౌతుంది కదా! కానీ ఇప్పుడు మాత్రం ఎలాగైనా ప్రభాస్ వివాహ వేడుక జరపాలని కుటుంబం మొత్తం డిసైడ్ అయినట్లు సమాచారం. ప్రభాస్ వచ్చే సమ్మర్ వరకు సినిమా షూటింగ్ లతోనే బిజీగా ఉంటాడు కాబట్టి, అప్పటివరకు పెళ్లి కుదిరినా జరగడం కష్టమే.
అభిమానులారా! ఇక ఆయన పెళ్లి విషయం వదిలెద్ధాం! సినిమాలు మాత్రం చూద్ధాం! చూడకుండా వదిలేయగలమా! ఆయన నటన! ఆయన ఒక అద్భుతం. అందుకే జనాలకు వెర్రి అభిమానం.