చైతన్య చేతిలో ఓడిపోయిన నాగార్జున నాని !

Seetha Sailaja
సెప్టెంబర్ నెల అక్కినేని నాగేశ్వరరావు పుట్టినరోజు వచ్చే నెలగా మాత్రమే కాకుండా ఈ నెల అంతా అక్కినేని హీరోల నెలగా మారిపోయింది. ఈ నెలలో వచ్చిన వినాయకచవితి రోజున నాగార్జున వారసుడు నాగచైతన్య నాగ్ కోడలు సమంతల సినిమాలు ఒకదాని పై ఒకటి పోటీగా విడుదలైతే అది చాలదు అన్నట్లుగా ఈవారం నాగార్జున ఇదే నెలలో తన దేవదాసును విడుదల చేసి సెప్టెంబర్ నెలను అక్కినేని నెలగా మార్చివేసాడు. 

మొన్న విడుదలైన ‘దేవదాస్’ కు డివైడ్ టాక్ వచ్చినా ఓపెనింగ్స్ కలక్షన్స్ విషయంలో సంతృప్తి కరంగానే వచ్చాయి అన్న వార్తలు వస్తున్నాయి. అయితే ‘దేవదాస్’ ఓపెనింగ్ కలక్షన్స్ మన ఇరు రాష్ట్రాలకు సంబంధించి చైతన్య ‘శైలజా రెడ్డి అల్లుడు’ కన్నా కొద్దిగా తక్కువగా రావడంతో కొడుకు చేతిలో తండ్రి ఓడిపోయాడా అంటూ జోక్స్ పడుతున్నాయి. 

తెలుస్తున్న సమాచారం మేరకు తొలిరోజు ‘శైలజా రెడ్డి’ కలెక్షన్లు కేవలం తెలుగు రాష్ట్రాల వరకు చూసుకున్నా తొలి రోజు 5.45 కోట్లు వచ్చాయి. కానీ నాని-నాగ్ కలిసి నటించిన ‘దేవదాస్’ మన ఇరు రాష్ట్రాలలోను తొలిరోజు 4.57 కోట్ల దగ్గరే ఆగిపోయింది అన్న వార్తలు వస్తున్నాయి. ‘శైలజా రెడ్డి’ ని 25 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తే ‘దేవదాస్’ మూవీని 40 కోట్ల నిర్మించారు. అయినా ఓపెనింగ్స్ విషయంలో మన ఇరు రాష్ట్రాలలోను ‘దేవదాస్’ ‘శైలజా రెడ్డి’ కన్నా వెనుకపడి ఉండటం ఆశ్చర్యకరం. 

అయితే ప్రపంచ వ్యాప్తంగా ‘దేవదాస్’ తొలిరోజు 6.5 కోట్ల షేర్ తెచ్చుకుంది. దీనికి ప్రధాన కారణం ఓవర్సీస్ ప్రేక్షకులలో నాగార్జున నానీ కాంబినేషన్ కు ఉన్న క్రేజ్ అనుకోవాలి. ఏది ఎలా చూసుకున్నా ‘దేవదాస్’ మూవీకి వచ్చిన డివైడ్ టాక్ రీత్యా ఈమూవీ ఈ వీకెండ్ తరువాత నిలదొక్కుకోలేక పోతే బిజినెస్ పరంగా ‘శైలజా రెడ్డి అల్లుడు’ కన్నా ఎక్కువ బిజినెస్ ‘దేవదాస్’ కు జరిగిన నేపధ్యంలో ‘దేవదాస్’ బయ్యర్లు ‘శైలజా రెడ్డి అల్లుడు’ బయ్యర్లకన్నా ఎక్కువ నష్టపోయే ఆస్కారం ఉంది అన్న వార్తలు హడావిడి చేస్తున్నాయి..  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: