రామ్ చరణ్ పెట్ లవర్ అన్న విషయం తెలిసిందే. విభిన్న జాతులకు చెందిన అనేక కుక్కలతో పాటు గుర్రాలు పెట్ బర్డ్స్ ఇలా చాల రకరకాల మూగ జీవులు చరణ్ ఇంట్లో ఉంటాయి. అయితే ఈమధ్య చరణ్ తన అక్క సుస్మితకు ప్రేమతో ఇచ్చిన ఒక బహుమానం ప్రస్తుతం చిరంజీవి నటిస్తున్న ‘సైరా’ షూటింగ్ పనులకు సమస్యగా మారిన విషయాన్ని చరణ్ సోదరి సుస్మిత ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరించింది.
ఈమధ్య కాలంలో ‘సైరా’ సినిమాకు కాస్ట్యూమ్స్ డిజైనర్ గా సుస్మిత వ్యవహరిస్తున్న నేపధ్యంలో ఆపనులు నిమిత్తం ఆమె తరుచూ ఎక్కువ రోజులు చిరంజీవి ఇంట్లో ఉండటం జరిగింది. ఈ నేపధ్యంలో ఆమె చరణ్ ముద్దుగా పెంచుకుంటున్న ఒక బొచ్చు కుక్క పిల్లతో చాల అభిమానంగా ఉండేదట.
ఈవిషయాన్ని పసిగట్టిన చరణ్ ఆమెకు కానుకగా ఆబొచ్చు కుక్క పిల్లను ఇవ్వడం జరిగిందట. ఎంతో ఆనందంతో చెన్నై లోని తన ఇంటికి ఆ కుక్క పిల్లను తీసుకు వెళ్ళిన సుస్మితకు ఆ కుక్క పిల్ల చుక్కలు చూపించడం మొదలు పెట్టిందట. సుస్మితకు ఇద్దరు పిల్లలు ఉన్న నేపధ్యంలో ఆ ఇద్దరు పిల్లలను చూసుకుంటూ ‘సైరా’ కాస్ట్యూమ్స్ పనులు చూడటం కష్టమైన నేపధ్యంలో మధ్యలో వచ్చిన ఈ కుక్క పిల్ల కూడ తన కుటుంబ సభ్యురాలుగా మారడంతో దాని అల్లరి తట్టుకోలేక సుస్మిత ‘సైరా’ కాస్ట్యూమ్స్ పనులకు సంబంధించిన విషయాలను నిర్వర్తించడంలో సరిగ్గా శ్రద్ద పెట్టలేక పోయిందట.
తన ‘సైరా’ పనులకు అడ్డు తగులుతున్న ఆ కుక్క పిల్ల బాధ్యతలు చూడలేక ఆమె ఈమధ్య చరణ్ కు ఫోన్ చేసి ఒక నెలరోజులు చూస్తాను ఇదే పరిస్థితి కొనసాగితే తన తమ్ముడు చరణ్ ఇచ్చిన గిఫ్ట్ అతడికే ఇచ్చేస్తాను అంటూ తన అసహనాన్ని వ్యక్త పరిచిందట. దీనితో తన అక్క సుస్మితకు వచ్చిన కోపానికి చరణ్ కూడ షాక్ అయి నవ్వుకున్నాడట..