గత కొంతకాలంగా రానా ఆరోగ్యం పై ఎన్నో వార్తలు వచ్చినా ఆవార్తలు అన్నింటిని గాసిప్పులుగా కొట్టి పడేస్తూ రానా కుటుంబ సభ్యులు ఈవ్యవహారానికి లైట్ టచ్ ఇవ్వడానికి అనేక ప్రయత్నాలు చేసారు. అనేక వైద్య పరీక్షలు తరువాత రానా కిడ్నీ సమస్యలకు సంబంధించిన వ్యాధి గురించి నిర్ధారణ అయిందని ప్రస్తుతం అతడికి ఈసమస్యల పరిష్కారానికి కిడ్నీ మార్పిడి మాత్రమే మార్గం అంటూ అమెరికా సింగపూర్ కు చెందిన విదేశీ డాక్టర్లు కూడ ఖచ్చితమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు ఆ ప్రముఖ ఇంగ్లీష్ దినపత్రిక కథనాన్ని ప్రచురించింది.
అంతేకాదు ప్రస్తుత పరిస్థుతులలో రానాకు కిడ్నీ ఇవ్వడానికి రానా తల్లి ముందుకు వస్తున్నా ఆమె ఇప్పటికే బిపి సమస్యలతో వైద్యం చేయించుకుంటున్న నేపధ్యంలో ఆమె కిడ్నీని తీసుకునే సాహసం చేయడం రానాకు కానీ అతడి తండ్రి సురేశ్ బాబుకు కానీ ఏమాత్రం ఇష్టం లేదు అని ఆపత్రిక తన కథనంలో పేర్కొంది. దీనితో రానాకు కిడ్నీ ఇచ్చే డోనర్ కోసం ఇప్పుడు అన్వేషణ జరుగుతోందని ముఖ్యంగా కిడ్నీ డోనర్ కుసంబందించి నిబంధనలు మన ఇండియాలో చాలా కఠినంగా ఉన్న నేపధ్యంలో అమెరికా సింగపూర్ లలో రానాకు సూటయ్యే కిడ్నీ డోనర్ కోసం రానా కుటుంబ సబ్యులు తీవ్ర అన్వేషణలో ఉన్నట్లు ఆపత్రిక ఆకథనంలో పేర్కొంది.
ఈమధ్య కాలంలో రానా ఆరోగ్యానికి సంబంధించిన ప్రశ్నలు ఎక్కువ అయిపోవడంతో ఈమధ్య సురేశ్ బాబు అతడి కుటుంబ సభ్యులు ఇళ్ళల్లో జరిగే ఫంక్షన్స్ కు కూడ వెళ్ళడానికి ఇష్టపడటం లేదని ఆ పత్రిక పేర్కొంది. అక్కడ రానా ఆరోగ్యం గురించి సన్నిహితులు ప్రశ్నలు ఎక్కువగా అడుగుతున్న నేపధ్యంలో ఆప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక దాటవేయడానికి ఇలా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుత పరిస్థుతులలో రానాకు కిడ్నీ మార్పిడి తప్ప మరొక పరిష్కారం కనిపించకపోవడంతో రానా ప్రస్తుతం నటిస్తున్న సినిమాలకు సంబంధించి తన పనిని పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నాడని తెలుస్తోంది. అంతేకాదు మరో సంవత్సరం వరకు ఏకొత్త సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ ను వినడం కానీ అంగీకరించడం కానీ చేయకూడదని రానా ఒక స్థిర నిర్ణయానికి వచ్చినట్లు ఆపత్రిక సమాచారం. మరి జాతీయ మీడియా కథనం పై కూడా రానా నుంచి ఎలాంటి సమాధానం ఇస్తాడు అన్నది టాక్..