తమిళ హీరోను మోసేస్తున్న కాజల్

Prasad
కెరీర్ మొదట్లో మెతక గా కనిపించిన హీరోయిన్ కాజల్ ఇప్పడు రాటు దేలిపోయింది. ఎక్కడ ఎలా మాట్లాడితే ఏ రకంగా నెగ్గుకొని వస్తామో బాగా వంట పట్టించుకుంది. బాలీవుడ్ లో నటిస్తున్నప్పుడు నేను హిందీ అమ్మాయినే అంటూ ఫోజుకొట్టిన కాజల్ ఇప్పడు తమిళ హీరో ను తెగ మోసేస్తుంది. అందాల కాజల్ ప్రస్తుతం తమిళ హీరో విజయ్ తో తుపాకీ అనే సినిమాలో నటిస్తోంది. దీంతో చెన్నై లో ఇప్పుడు కాజల్ విజయ్ జపం చేస్తోంది. తన కెరీర్ లో విజయ్ వంటి హీరోను చూడలేదంటుంది. విజయ్ యాక్టింగ్, డాన్స్, కామెడీ, టైమింగ్, రొమాన్స్ అద్భుతం అంటూ తెగ పొగుడుతుంది. కాజల్ మాటలు వింటున్న వారు ఏ ఎండకాగొడుగు పట్టడంలో కాజల్ ఏక్స్ పర్ట్ అయిందని గుసగుస లాడుకుంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: