ఆ సినిమాలో నేను నటించడం లేదు మెగా అల్లుడు!

Edari Rama Krishna
తెలుగు ఇండస్ట్రీలో మంచి సక్సెస్ చిత్రాలతో ఆకట్టుకున్న దర్శకులు శ్రీకాంత్ అడ్డాల.  ప్రిన్స్ మహేష్ తో తెరకెక్కించిన ‘బ్రహ్మోత్సవం’ చిత్రం తర్వాత మళ్లీ కంటికి కనిపించలేదు. చాలా రోజులుగా మీడియాకు కూడా దూరంగా ఉంటూ వస్తున్నారు అడ్డాలు. ఇదిలా ఉంటే..ఈ మద్య శ్రీకాంవత్ అడ్డాల.. మెగా కాంపౌండ్ లో ప్రత్యక్షమయ్యాడని ఆ మధ్య వార్తలొచ్చాయి. తన స్టయిల్ లో ఓ మంచి కథతో నిర్మాత అల్లు అరవింద్ ను మెప్పించాడని, అందులో అల్లు శిరీష్ హీరోగా నటించబోతున్నాడంటూ కథనాలు కనిపించాయి.

తాజాగా దీనిపై స్పందించిన అల్లు శిరీష్..శ్రీకాంత్ అడ్డాలతో నేను సినిమా చేయడం లేదు. నిజానికి అలాంటి డిస్కషన్ కూడా లేదు. ఆయన్ని కొన్ని నెలలుగా నేనెప్పుడూ కలవలేదు. ఆయనతో సినిమా ఉంటుందని నేను అనుకోను. గీతా ఆర్ట్స్   సంస్థ చాలామందికి అడ్వాన్సులు ఇచ్చింది.

అలాంటి వారిలో బహుషా శ్రీకాంత్ అడ్డాల కూడా ఉండీ ఉంటారని..కథ విన్న తర్వాత నాన్న శ్రీకాంత్ అడ్డాలతో నా పేరు అనుకుని ఉంటారని అన్నారు. ప్రస్తుతం ఏబీసీడీ అనే మలయాళ సినిమా రీమేక్ లో నటిస్తున్నాడు శిరీష్. ఈ మూవీతో పాటు సూర్య హీరోగా నటించనున్న ఓ తమిళ సినిమాలో కూడా కీలక పాత్ర పోషించనున్నాడు. జులై నుంచి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఉంటుంది.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: