జూనియర్ చరణ్ ల కాంబినేషన్ లో రాబోతున్న అక్టోబర్ నుండి రాజమౌళి తీయబోతున్న మల్టీ స్టారర్ కు సంబంధించి మరొక షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఈసినిమా ప్రారంభోత్సవ ముహూర్తం కూడ జరగకుండానే ఈమూవీ తమిళ మళయాళ హిందీ రైట్స్ ను ఒక ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ అత్యంత భారీ మొత్తానికి ముందుగానే కొనుక్కోవడానికి ముందుకు వచ్చింది అన్న వార్తలు వస్తున్నాయి.
ఈ ఆఫర్ కు ఈమూవీ నిర్మాత డివివి దానయ్య ఆసక్తి కనపరిచినా ఎట్టి పరిస్తుతులలోను ఈ ఆఫర్ ను ఒప్పుకోవద్దని రాజమౌళి నిర్మాత దానయ్య పై ఒత్తిడి చేసి ఆ ఆఫర్ ఆలోచనలను విరమింపచేసినట్లు వార్తలు వస్తున్నాయి. దీనికి కారణం రాజమౌళి తీయబోతున్న ‘ఆర్ఆర్ఆర్’ మల్టీ స్టారర్ విషయంలో రాజమౌళి పారితోషికం బదులు మూవీ బిజినెస్ లో షేర్ తీసుకుంటునట్లు సమాచారం.
ఇలాంటి పరిస్థుతులలో ఇప్పుడే ఈమూవీ బిజినెస్ ను మొదలు పెట్టే బదులు ఈమూవీ పూర్తి అయిన తరువాత ఏర్పడే క్రేజ్ తో కనీవినీ ఎరుగని బిజినెస్ చేయాలని రాజమౌళి ఆలోచన అని అంటున్నారు. ఈకారణంతోనే ‘ఆర్ఆర్ఆర్’ భారీ ఆఫర్లు అప్పుడే ప్రారంభం అయినా రాజమౌళి ఆసక్తి కనపరచడం లేదు అని టాక్.
ఇది ఇలా ఉండగా 1985 ఒలింపిక్స్ నేపధ్యంలో కథ ఉండే ఈమూవీలో జూనియర్ ఎన్టీఆర్ బాక్సర్ గా కనిపిస్తే చరణ్ జాకీ గా కనిపించబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. ‘మహానటి’ మూవీ తరువాత రాజమౌళి ఆలోచనలలో మార్పులు రావడంతో ఈమూవీలో కీర్తీ సురేశ్ నటించినా ఆశ్చర్యం లేదు అని అంటున్నారు. సుమారు 300 కోట్ల బడ్జెట్ తో 2019 సమ్మర్ ను టార్గెట్ చేస్తూ విడుదల కాబోతున్న ఈమూవీ ‘బాహుబలి’ రికార్డులను తలక్రిందులు చేసినా ఆశ్చర్యం లేదు అని అంటున్నారు..