సంచలనంగా మారిన నాని డబుల్ డోస్ స్ట్రాటజీ !

Seetha Sailaja
వరస విజయాలతో దూసుకుపోతున్న నాని ‘కృష్ణార్జునుల యుద్ధం’  విడుదలకు మరో 5రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఈ నేపధ్యంలో ఈసినిమాలో డ్యూయల్ రోల్ ను పోషిస్తున్న నాని ఈసినిమాకు తగ్గట్టుగానే వినూత్నంగా రెండు కార్ల పబ్లిసిటీని ఒకదాని పై ఒకటి జోడించి తిప్పుతున్న తీరు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. 

ఈమూవీలో నాని పూర్తి వైరుధ్యమైన వేరియేషన్స్ లో కనిపించే పాత్రలలో నటిస్తున్న విషయం తెలిసిందే. టాలీవుడ్ బాక్స్ ఆఫీసుకు ‘రంగస్థలం’ తో కొత్త కళ వచ్చిన నేపధ్యంలో ఈ ట్రెండ్ ను కొనసాగించి తాను కూడ సమ్మర్ స్టార్ అనిపించుకోవడానికి నాని ప్రయత్నిస్తున్నాడు. 

అయితే ఈసినిమా వచ్చిన కేవలం వారం రోజుల గ్యాప్ తో ‘భరత్ అనే నేను’ విడుదల అవుతున్న నేపధ్యంలో మహేష్ సునామీని తట్టుకుని నాని ఎంత వరకు ఈ సమ్మర్ రేస్ లో విజయం సాధిస్తాడు అన్న సందేహాలు చాలామందికి ఉన్నాయి. ఇప్పటికే నాని సెకండ్ లీగ్ హీరోలలో అగ్రస్థానంలో కొనసాగుతున్న పరిస్థితులలో టాప్ యంగ్ హీరోల రేస్ లోకి అడుగు పెట్టడానికి ఈమూవీ ద్వారా చాల గట్టి  ప్రయత్నాలు చేస్తున్నాడు. 

గతంలో ఎన్టీఆర్ - ఎఎన్ఆర్ నటించిన ఆల్ టైం బ్లాక్ అండ్ వైట్ క్లాసిక్ మూవీ ‘కృష్ణార్జున యుద్ధం’ టైటిల్ ను దర్శకుడు మేర్లపాక గాంధీ చాల వ్యూహాత్మకంగా వాడుకుంటూ ఈమూవీని అవుట్ అండ్ అవుట్ ఎంటర్ టైనర్ గా తీర్చిదిద్దినట్లు తెలుస్తోంది. నాని చేస్తున్న సాహసం విజవంతమై మహేష్ మ్యానియా ముందు ఈమూవీ పాజిటివ్ టాక్ తో నిలబడగలిగితే ఈసినిమా తరువాత నాని టాప్ యంగ్ హీరోల రేస్ లో చేరిపోవడం ఖాయం అన్న మాటలు వినిపిస్తున్నాయి..  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: