జూనియర్ చరణ్ మల్టీ స్టారర్ పై చిరు షాకింగ్ సలహాలు !

Seetha Sailaja
‘బాహుబలి’ భారీ సక్సస్ తరువాత రాజమౌళి జూనియర్ చరణ్ లతో ఒక భారీ మల్టీ స్టారర్ కు రంగం సిద్ధం చేసిన విషయం ఓపెన్ సీక్రెట్. ఈమూవీ ప్రాజెక్ట్ గురించి అధికారికంగా ఈనెలలో రాబోతున్న ‘ఉగాది’ పండుగ రోజున రాజమౌళి ప్రకటిస్తాడు అని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ పరిస్థుతుల నేపధ్యంలో ఈమూవీ ప్రాజెక్ట్ కు సంబంధించి చిరంజీవి రామ్ చరణ్ కు కొన్ని ఆసక్తికర సలహాలు ఇచ్చాడు అన్న ప్రచారం జరుగుతోంది. 

ఇండస్ట్రీ వర్గాలలో వినపడుతున్న వార్తల ప్రకారం మొట్టమొదట చరణ్ దగ్గర రాజమౌళి ఈ మల్టీ స్టారర్ ప్రస్తావన తీసుకువచ్చి ఈమూవీ స్టోరీ లైన్ చెప్పినప్పుడు చరణ్ ఈ మల్టీ స్టారర్ విషయమై చిరంజీవి సలహాలను తీసుకోకుండా స్పాట్ లో ఆనందంతో రాజమౌళికి ఓకె చెప్పాడు అని టాక్. అయితే చరణ్ తన సినిమాల ఎంపికలో చిరంజీవి సలహాలు లేకుండా ఒక్క అడుగు కూడ వేయడు అన్న విషయం ఇండస్ట్రీ ఓపెన్ సీక్రెట్. 

రాజమౌళికి చరణ్ ఓకె  చెప్పిన తరువాత కొన్ని గంటల గ్యాప్ తో చరణ్ ఈ ప్రాజెక్ట్ విషయం చిరంజీవికి చెప్పి తన తండ్రి తన నిర్ణయం గురించి ఏమి అంటాడో అని భయపడటమే కాకుండా జూనియర్ తో మల్టీ స్టారర్ చేసినప్పుడు తన ఇమేజ్ తగ్గి పోతుందేమో అన్న భయాలను చరణ్ చిరంజీవి దగ్గర బయట పెట్టాడు అని టాక్. అయితే చిరంజీవి చరణ్ నిర్ణయాన్ని మెచ్చుకోవడమే కాకుండా రాజమౌళి లాంటి టాప్ డైరెక్టర్ దర్శకత్వంలో జూనియర్ లాంటి టాప్ హీరోతో ఒక మల్టీ స్టారర్ చేస్తున్నప్పుడు ఇమేజ్ గురించి పట్టించుకోవద్దని కథలో జూనియర్ కు కొంత ప్రాముఖ్యత ఉన్నా ఆ విషయాలను తేలికగా తీసుకోమని సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది. 

అంతేకాదు గతంలో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ – కృష్ణ శోభన్ బాబులు కలిసి నటించిన మల్టీ స్టారర్స్ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో వారి ఇమేజ్ మరింత పెరిగిన సందర్భాలను చిరంజీవి చరణ్ కు గుర్తుకు చేసాడు అన్న వార్తలు కూడ ఉన్నాయి. రాజమౌళి మల్టీ స్టారర్ లో చరణ్ పాత్ర కన్నా జూనియర్ పాత్రకు కొద్దిగా ప్రాముఖ్యత ఎక్కువగా ఉంటుంది అన్న వార్తలు వస్తున్న నేపధ్యంలో చరణ్ అనుమానాలకు చిరంజీవి ఇలా వ్యూహాత్మక సలహాలు ఇచ్చి ఉంటాడు అనుకోవాలి.. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: