టాలీవుడ్ లో నెంబర్ గేం ఎప్పటినుండో కొనసాగుతుంది. మెగాస్టార్ తర్వాత ఆ రేసు ముగిసింది అనుకున్నారు. సినిమా సినిమాకు స్టార్ హీరోల నెంబర్ల లెక్క మారుతుంది. మహేష్, పవన్ ముందు వరుసలో ఉన్నట్టు కనిపించినా ఈమధ్య వరుస హిట్లతో సత్తా చాటుతున్న ఎన్.టి.ఆర్ కూడా ఈ రేసులో నిలిచాడు.
ఇక మెగా హీరోలైన స్టైలిష్ స్టార్ నెంబర్ రేసులో ఉండేందుకు వరుస హిట్లు కొడుతున్నాడు. ఇక కొన్నాళ్ల వెనకపడ్డట్టు అనిపించిన మెగా పవర్ స్టార్ రాం చరణ్ ధ్రువతో మళ్లీ తన సత్తా చాటుకున్నాడు. ఇక రంగస్థలంతో పూర్తిస్థాయిలో మేకోవర్ చూపిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత బోయపాటి మూవీ చేస్తున్నాడు రాం చరణ్.
సినిమా సెట్స్ మీద ఉన్నప్పుడే ఈ మూవీ రికార్డులను సృష్టిస్తుంది. మొదటిసారిగా అందరి హీరోల రికార్డులను దాటి అనూహ్యంగా రాం చరణ్ రేసులో ముందు నిలిచాడు. 22 కోట్ల హింది రైట్స్ తో బోయపాటి శ్రీను సినిమా బిజినెస్ చేసుకున్న చరణ్. ఈ లెక్కతో నెంబర్ 1 గా నిలిచేలా ఉన్నాడని అంటున్నారు.
ఓ పక్క రంగస్థలం సినిమాతోనే మంచి ఊపు మీద కనిపిస్తుండగా ఇప్పుడు రాబోతున్న బోయపాటి సినిమాకు చరణ్ సంచలనాలు సృష్టిస్తున్నాడు. మహేష్, పవన్ ప్రస్తుతం ఫ్లాపుల్లో ఉండగా అందివచ్చిన ఈ అవకాశాన్ని చరణ్ ఏవిధంగా వాడుకుంటాడో చూడాలి. బోయపాటి శ్రీను సినిమా తర్వాత రాజమౌళి డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడు రాం చరణ్.