గబ్బర్ సింగ్ నిర్మాతకు ఏం మిగిలింది.?

Prasad
పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన గబ్బర్ సింగ్ సినిమా సూపర్ హిట్ అయింది. వరస పరాజయల్లో ఉన్న పవన్ కళ్యాణ్ కు భారీ హిట్ ఇచ్చి ఊరటనిచ్చింది.  కాగా, ఈ సినిమా శనివారంతో వంద రోజుల ప్రదర్శన ను పూర్తి చేసుకుంటుంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత బండ్ల గణేష్ గబ్బర్ సింగ్ చిత్ర విశేషాలను తెలిపారు. ఈ సినిమా కు ముందు ఆయన తీసిన సినిమాలు పరాజయం చెందాయి. దీంతో గబ్బర్ సింగ్ చిత్రం తీసే ముందు అభద్రతా భావానికి గురయ్యారట. విజయం పొందే అర్హత తనకు లేదేమో అని గణేష్ భావించారట. కానీ కష్టపడితే విజయం తప్పకుండా దక్కుతుందని గబ్బర్ సింగ్ సినిమా నిరూపించిందని గణేష్ తెలిపారు. మరో ఇరవై ఏళ్ళు నిర్మాతగా నిర్భయంగా ప్రయాణం చేయగలననే నమ్మకాన్ని గబ్బర్ సింగ్ తనకు మిగిల్చిందని, జయాపజయాలతో సంబంధం లేని కథానాయుడు పవన్ కళ్యాణ్ అని నిర్మాత బండ్లగణేష్ తెలిపారు.  గబ్బర్ సింగ్ విజయం సాధించడంలో హరీష్ శంకర్, దేవీశ్రీ ప్రసాద్ పాత్ర విలువ కట్టలేదని బండ్ల గణేష్ పేర్కొన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: