ఆమె విషయంలో పోటీ పడుతున్న ఎన్టీఆర్, మహేష్..!

shami
టాలీవుడ్ లో ఎంతమంది హీరోయిన్స్ వచ్చినా క్లిక్ అయ్యేది మాత్రం తక్కువమంది మాత్రమే.. అలానే ఇప్పుడు కొంతమంది హీరోయిన్స్ తమ ఫాంను కొనసాగిస్తున్నారు. వారిలో డిజె భామ పూజా హెగ్దె కూడా ఉంది. ముకుంద, ఒక లైలా కోసం సినిమాలు చేసినా రాని క్రేజ్ డిజెలో బిజిని లుక్ తో కనిపించే సరికి వచ్చేసింది.   


చూడగానే మెప్పించే అందంతో అలరిస్తున్న పూజా హెగ్దె కోసం ఇప్పుడు ఇద్దరు స్టార్స్ హీరోల మధ్య పోటీ ఏర్పడింది. ఆ ఇద్దరు ఎవరో కాదు ఒకరు సూపర్ స్టార్ మహేష్, మరొకరు యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్. ప్రస్తుతం కొరటాల శివ డైరక్షన్ లో భరత్ అనే నేను సినిమా చేస్తున్న మహేష్ ఆ తర్వాత వంశీ పైడిపల్లితో సినిమా ఫిక్స్ చేసుకున్నాడు. ఆ సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్దె కన్ఫాం అయినట్టే అని తెలుస్తుంది. 


ఇక యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ త్రివిక్రం సినిమాలో కూడా పూజాని ఎంపిక చేశారట. ఒకేసారి ఇద్దరి స్టార్స్ అవకాశాలను అందుకున్న పూజా ఇప్పుడు టాలీవుడ్ లక్కీ హీరోయిన్ అయ్యింది. బన్ని డిజె తర్వాత బెల్లంకొండ శ్రీనివాస్ సాక్ష్యం సినిమాలో నటిస్తున్న పూజా ఆ సినిమాతో పాటుగా నితిన్ శ్రీనివాస కళ్యాణం సినిమాలో కూడా ఛాన్స్ పట్టేసిందట.


అమ్మడు క్రేజ్ చూస్తుంటే 2018, 19 సంవత్సరాల్లో టాలీవుడ్ లో ఓ ఊపు ఊపేలానే ఉంది. మహేష్, ఎన్.టి.ఆర్ సినిమాల్లో నటిస్తే స్టార్స్ కు ఫస్ట్ ఆప్షన్ అమ్మడే అవుతుంది. సమంత పెళ్లి కావడం, రకుల్ ఫాం కోల్పోవడం కలిసి వచ్చి పూజాకు మంచి క్రేజ్ తెచ్చి పెట్టాయి. మరి అమ్మడు ఈ క్రేజ్ ను ఎలా క్యాష్ చేసుకుంటుందో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: