అనసూయ ఆక్రోశం!

Seetha Sailaja

 

 హాట్ యాంకర్  అనసూయ  ‘డియర్ ఇండియా’ పేరిట చేసిన ట్విట్ సంచలనంగా మారింది. బుల్లి తెర పై  టాప్ యాంకర్  గా కొనసాగుతున్న అనసూయ తెలుగు ఎంటర్టెన్మెంట్ రంగంలో అత్యధిక రెమ్యూనరేషన్ అందుకుంటున్న సెలిబ్రిటీ.  అటువంటి అనసూయ చేసిన సంచలన ట్విట్ టాపిక్ ఆఫ్ ది మీడియాగా మారింది.

 

 ప్రస్తుతం  సమాజంలో తాను ఎదుర్కొంటున్న పరిస్థితులను తనతో పాటు తన ఫ్యామిలీ ఎదుర్కొంటున్న వేధింపులను వెల్లడించే ప్రయత్నం చేసింది. ‘డియర్ ఇండియా’ అంటూ ఈ దేశంలో సమాజంలో ఇంకా మారని పరిస్థితులపై సంచలన వ్యాఖ్యలు చేసింది  అనసూయ.    ఒక కూతురిగా, సోదరిగా, మహిళగా, భార్యగా, కోడలిగా, తల్లిగా  తాను తన భాధ్యతలను నిర్వర్తిస్తున్నాను అంటూ తన ట్విట్ లో తాను అనుభవిస్తున్న భాధలను షేర్ చేసింది. తాను   చేసే పని, ధరించే దుస్తుల వల్ల  తన  కుటుంబం ఇబ్బంది గా ఫీలవ్వడం లేదుఅని చెపుతూ   కాని వాటి పై  బయటి వ్యక్తులు అభ్యంతరం తెలపడం తనకు ఆశ్చర్యంగా ఉంది అని అంటోంది అనసూయ.

 

 ప్రతి వ్యక్తి  మాట్లాడే స్వేచ్ఛ ఉంది కదా అని  తన భర్తను  భర్తను, పిల్లలను, తల్లిదండ్రులను, కుటుంబాన్ని దూషిస్తున్నారు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తోంది ఈహాట్ యాంకర్.  చాలామంది  అమర్యాదగా, అగౌరవంగాచేస్తున్న వ్యాఖ్యలు తనను  మానసికంగా హింసిస్తున్నాయి అని అంటూ అనసూయ చేసిన సంచాల వ్యాఖ్యలు పెను దుమారాన్ని సృట్టిస్తున్నాయి.


బాధ్యత కలిగిన ఓ మహిళగా  ఈ అన్యాన్ని తాను  ప్రశ్నిస్తున్నాను అని అంటూ స్వేచ్ఛకు అర్థం ఇదేనా? అంటూ ప్రశ్నలు వేస్తోంది ఈ సంచలన యాంకర్. అంతేకాదు తాను కోరుకున్న పనిని చేసుకునే స్వేచ్ఛ తనకు  లేదా? అంటూ అనసూయ ఎదురు ప్రశ్నలు వేస్తోంది. సంస్కృతీ సాంప్రదాయాల పేరిట తన  భావాలను గౌరవాన్ని అణగదొక్కే విమర్శకుల దాడి మధ్య  తాను  ఎప్పుడు ఇలాగే  జీవించాలా ? అంటూ  అనసూయ తన మనసులోని ఆవేదనను, ఆక్రోశాన్ని వెళ్లగక్కింది. ప్రస్తుతం ఈమె చేసిన ట్విట్ సంచలనంగా మారింది. ఏమైనా అనసూయ ఆక్రోశం వెనుక  భావాలను అర్ధం చేసుకునే స్థితిలో నేటి సమాజం ఉందా అన్నదే ప్రశ్న. అనసూయ ట్విట్ ఇలా ఉంది..








మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: