సెక్సీ బ్యూటీ వామ్మో..మియా మాల్కోవా జోష్ మామూలుగా లేదు..!

Edari Rama Krishna
రామ్‌గోపాల్ వర్మ ‘జిఎస్‌టి’ అంటూ మరో సంచలనానికి తెరతీశారు. జీఎస్ టీ అంటే మోడీ మార్కు జిఎస్‌టి కాదు, ఇది వేరే జిఎస్‌టి... ‘గాడ్, సెక్స్ అండ్ ట్రూత్’ అనే నీలిచిత్రాన్ని ఈసారి వర్మ మనకు అనుగ్రహించారు. ఈ చిత్రంలో మియా మల్కొవా అనే ప్రఖ్యాత అమెరికన్ పోర్న్‌స్టార్ లైంగికత గురించి, శృంగారం గురించి తన భావనల్ని ప్రేక్షకు లతో పంచు కుంటుంది. అమెరికన్ పోర్న్‌స్టార్ మియా మాల్కోవాతో ఓ పోర్న్ వీడియోను రూపొందిస్తున్నట్లు జనవరి 10న ట్విట్టర్ ద్వారా ప్రకటించాడు వర్మ.

అయితే భారతీయ సంస్కృతికి పట్టిన గ్రహణాన్ని పారద్రోలేందుకు సంప్రదాయవాదులు ఓవైపు కత్తులు నూరుతుంటే, దీని ద్వారా ఆర్‌జివి సమాజానికి ఏం సందేశాన్ని ఇస్తున్నారంటూ మరోవైపు మేధావులు, ఉద్యమకారులు కన్నెర్ర చేస్తున్నారు. కోరికల్ని అణచుకుని అల్లాడుతున్న భారతీయ శృంగార కరవు పీడితులకు ఇదొక వరంలాంటిదని భావిస్తున్న వారు కూడా ఉన్నారు. మియా మాల్కో అనే యువతి సెక్స్ గురించి తను ఎలా ఫీల్ అవుతుందో చెప్పేదే ఈ సినిమా అని వర్మ వెల్లడించారు. ఇలాంటిది ఇంతవరకు ఎవరూ తీయలేదని అన్నారు.

మియా మాల్కో అనే యువతి తనను ఎవరైతే చూస్తున్నారో.. వాళ్లకు తన భావాల గురించి చెప్పడమేనని ఆయన అన్నారు. ఇది డాక్యుమెంటరీ, సినిమా కాదని, ఒక వీడియో అని, దీన్ని ఈ నెల 26న యూట్యూబ్‌లో పెడతానని, ఆ రోజు ఫ్రీడమ్ రోజని.. అందరికీ ప్రీడమ్ అని వర్మ చలోక్తి విసిరారు. ఇలా ఉంటే..మియా మాల్కోవా పోస్టర్ చూడగానే నెటిజన్లు ఆమె కోసం వెతకడం ప్రారంభించారు. నెట్టింట్లో పెద్ద పిల్లలు మాల్కోవా వివరాల కోసం అంతే ఆశగా వెతుకుతున్నారు. ఎవరీ మియా? అంటూ కంప్యూటర్‌ గ్రౌండ్‌లో సెర్చ్‌ ఇంజిన్‌ లైట్స్‌ వేసుకుని మరీ కొందరు పెద్దలు కళ్లకు పని చెబుతున్నారు.

భారతీయులు ఇంతగా ఆమె కోసం వెతుకుతున్నారు కాబట్టే గ్రూగుల్ ట్రెండ్స్‌లో మియా మాల్కావా ఇప్పుడు ఫస్ట్ ప్లేస్‌లో ఉంది. జనవరి 11 నుంచే మాల్కోవా టాప్ ప్లేస్‌కు చేరింది. ఈ సందర్భంగా వర్మ మరో ట్విట్ విసిరారు..‘‘గూగుల్ విడుదల చేసిన గణాంకాల ప్రకారం గాడ్, సెక్స్ అండ్ ట్రూత్ వెనకున్న అసలైన నిజం ఇది. మన ప్రధాని నరేంద్ర మోదీ, భారత కుబేరుడు ముకేష్ అంబానీ కంటే మియా మాల్కోవా ఎక్కువ పాపులర్ అయింది.’’ అంటూ గూగుల్ స్టాటిస్టిక్స్‌ను పోస్ట్ చేశాడు వర్మ.
The real Truth behind God, Sex and Truth as per statics released by Google.. @MiaMalkova is more popular than our P M Narendra Modi and India’s richest man Mukesh Ambani ..Hail #GodSexTruth pic.twitter.com/aO7mNcbe5g

— Ram Gopal Varma (@RGVzoomin) January 23, 2018

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: