బాలయ్య మీద పడిన పవన్ బాధ్యత !

Seetha Sailaja

‘అజ్ఞాతవాసి’ మూవీకి నెగిటివ్ టాక్ రావడంతో ఇప్పటి వరకు ఎక్కడా కనిపించని ఆన్ లైన్ టిక్కెట్లు ఒక్కసారి హఠాత్ గా ఆన్ లైన్ లో తిరిగి ఈరోజు ఉదయం నుండి ప్రత్యక్షం అవ్వడంతో ‘అజ్ఞాతవాసి’ టిక్కెట్లకు పెద్దగా ఎవరు మోజు పడటం లేదు అన్న విషయం స్పష్టమైంది. దీనితో ‘అజ్ఞాతవాసి’ బయ్యర్లకు దడ మొదలు కావడంతో తమ పరిస్థితి ఏమిటి అంటూ ‘అజ్ఞాతవాసి’ నిర్మాతల పై ఒత్తిడి చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

 

ఈసినిమాకు సంబంధించి తొలిరోజు ఓపెనింగ్స్ ఎదో విధంగా గట్టెక్కినా అప్పుడే ‘అజ్ఞాతవాసి’ కి సంబంధించిన పైరసీ లింకులు ప్రత్యక్షం అవుతున్నాయి అని వస్తున్న గాసిప్పులు ఈ మూవీ బయ్యర్లను మరింత ఆందోళనకు గురి చేస్తున్నట్లు టాక్. దీనితో ఈమూవీ బయ్యర్లతో పాటు ఈసినిమాను తీసిన దర్శక నిర్మాతలు కూడ రేపు విడుదల కాబోతున్న బాలయ్య ‘జై సింహా’ పై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.

 

పెద్దగా అంచనాలు లేని ఈసినిమాకు కూడ డివైడ్ టాక్ వస్తే అది ‘అజ్ఞాతవాసికి’ ప్లస్ పాయింట్ గా మారి ఈమూవీ కలక్షన్స్ పెరుగుతాయని ‘అజ్ఞాతవాసి’ నిర్మాతలు తమ బయ్యర్లకు సద్దిచెపుతున్నట్లు టాక్. అంతేకాదు సంక్రాంతి పండుగ మూడు రోజులు ఉంటుంది కాబట్టి ఈమూడు రోజులు టాప్ హీరోల సినిమాలు చూసే అలవాటు తెలుగు ప్రజలకు ఉంది కాబట్టి ఆరోజులలో ‘అజ్ఞాతవాసి’ కలక్షన్స్ తిరిగి పుంజుకుంటాయని నిర్మాతలు బయ్యర్లకు ధైర్యం చెపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

 

ఇది ఇలా ఉండగా ‘అజ్ఞాతవాసి’ తరువాత పవన్ మరి ఏ సినిమా అయినా చేస్తాడా లేదంటే కొంతకాలం తన సినిమాల నిర్ణయం తీసుకునే విషయంలో కూడ మౌనాన్ని కొనసాగిస్తాడా అన్న సందేహాలు మరికొందరు వ్యక్త పరుస్తున్నారు. ఇప్పటికే పవన్ ముగ్గురు ప్రముఖ నిర్మాతల దగ్గర నుండి అడ్వాన్స్ లు కూడ తీసుకున్న నేపధ్యంలో వీటి పరిస్థితి ఏమిటి అని మరికొందరు సందేహాలు వ్యక్త పరుస్తున్నారు. మరొకవైపు ఇదే సంవత్సరం నవంబర్ లో మన ఇరు రాష్ట్రాలలోను అదేవిధంగా కేంద్రంలోను ముందస్తు ఎన్నికలు వస్తాయి అని ప్రచారం జరుగుతున్న నేపధ్యంలో ఈ గ్యాప్ లో పవన్ మరొక సినిమాను చేస్తాడా లేదంటే తన దృష్టి అంతా ‘జనసేన’ కార్యకలాపాల పై పెడతాడా అనే విషయం పై అనేక మంది అనేక విధాలుగా ఊహాగానాలు చేస్తున్నారు..  

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: