అంచనాలు తలకిందులు చేసిన నాని.. డివైడ్ టాక్ తో 50 కోట్లు..!

shami
నాచురల్ స్టార్ నాని హీరోగా శ్రీరాం వేణు డైరక్షన్ లో వచ్చిన సినిమా ఎం.సి.ఏ. దిల్ రాజు నిర్మాణంలో వచ్చిన ఈ సినిమా రిలీజ్ రోజు డివైడ్ టాక్ తెచ్చుకోగా పోటీగా స్టార్ సినిమాలేవి లేకపోవడంతో సినిమా దూసుకెళ్తుంది. ఎవడే సుబ్రమణ్యం నుండి నాని వరుస విజయాలను అందుకుంటున్నాడు. ఎం.సి.ఏ సినిమా కూడా మిడిల్ క్లాస్ అబ్బాయిల పవర్ ఏంటో చూపించాడు.


సాయి పల్లవి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో ఆమె కన్నా భూమిక ఈ సినిమాలో స్పెషల్ గా ఆకట్టుకున్నారు. ఇక ఈ సినిమా టాక్ ఎలా ఉన్నా సరే కలక్షన్స్ మాత్రం దూసుకెళ్తున్నాయి. ఇప్పటికే నాని ఎం.సి.ఏ 50 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిందని అంటున్నారు. డివైడ్ టాక్ తో నాని ఎం.సి.ఏ ఈ రేంజ్ లో వసూళు చేయడం అందరికి షాక్ ఇచ్చింది.


మినిమం గ్యారెంటీ హీరో అవడంతో నాని సినిమా అంటే ఒక్కసారైనా చూడాలి అన్న లెక్క వచ్చింది. ఇక ఎం.సి.ఏ సినిమా విషయంలో మొదటి భాగం బాగుందని అనిపించినా సెకండ్ హాఫ్ మాత్రం డల్ గా నడిపించాడు. మొత్తానికి నాని మరోసారి 50 కోట్ల గ్రాస్ తో సత్తా చాటాడు. శ్రీరాం వేణు డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమా దర్శకుడికి 6 ఏళ్ల తర్వాత చేసిన ప్రయత్నానికి మంచి ఫలితాన్ని అందించింది.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: