అత్యాచారం కేసులో ఇరుక్కున్న సంగీత దర్శకుడు చక్రీ...!
టాలీవుడ్ సినిమా రంగంలో ప్రముఖ సినీ సంగీత దర్శకుడుగా పేరుగాంచిన చక్రి సినిమా నిర్మాత పరుచూరి ప్రసాద్‌పై జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంద వార్తలు వచ్చాయి. రాజధానిలో నిన్న జరిగిన ఫ్రెండ్షిప్ డే వేడుకల సందర్భంగా వీరిద్దరు ఓ యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు వార్తలు వస్తున్నాయి. యువతి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.
వీరిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు టీవీ ఛానల్స్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. పోలీసులు ఈ ఘటనపై సమగ్ర విచారణ జరుపుతున్నారట. ఓ ప్రముఖ సంగీత దర్శకుడైన చక్రి ఇలాంటి కేసులో ఇరుక్కోవడం టాలీవుడ్ లో చర్చనీయాంశం గా మారింది. మరో వైపు ఈ వ్యవహారం పై చక్రి కుటుంబ సభ్యులు కలవరానికి గురి చేస్తోంది. ఈ ఘటనపై స్పందించడానికి సినీ ప్రముఖులు ఎవరూ ముందుకు రావడం లేదు అంటున్నారు. ఇప్పటికే రకరకాల ఉద్యమాల మధ్య నలిగిపోతున్న తెలుగు సినిమా పరిశ్రమ ఇటువంటి వివాదాలలో కూడా చిక్కుకుంటే టాలీవుడ్ ఉనికి కోల్పోతుందని అంటున్నారు...