ప్రపంచ తెరపై మరోసారి బాహుబలి విజయ విహారమా?

frame ప్రపంచ తెరపై మరోసారి బాహుబలి విజయ విహారమా?

దేశ వ్యాప‍్తంగానే కాదు ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన తెలుగు సినిమా బాహుబలి ప్రభంజనానికి ఇప్పటికీ ఎదురులేకుండా అప్రతిహతంగా కొనసాగుతూనే ఉంది. వెండి తెర మీద మిల మిల మెరిసిన ఈ సినిమా, బుల్లి తెర మీద కూడా తనస్వైర విహారం కొనసాగించింది. అయితే సంచలన భారీ చిత్రం త్వరలో ఓవర్ సీస్ అనేక దేశాల్లో విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే అమెరికా యుకె కెనడా లాంటి ఎంగ్లీష్ స్పీకింగ్ దేశాల్లో విడుదలై భారీ వసూళ్లు సాధించగా ముందు ముందు మరిన్ని దేశాల్లో రిలీజ్ చేసేందుకు సిద్ధమవుతుందీ చిత్రయూనిట్.

bahubali china japan korean posters కోసం చిత్ర ఫలితం


ఈ నెల 29న బాహుబలి 2 జపనీస్ భాషలో డబ్ చేసి, జపాన్ సెన్సార్ బోర్డ్ ఇచ్చిన ‘జీ’ సర్టిఫికేట్‌ తో జపాన్ లో భారీగా విడుదల చేస్తున్నారు. మన సెన్సార్ బోర్డ్ అందించే క్లీన్ యు సర్టిఫికేట్ కు ఇది సమానం. త్వరలోనే కొరియా, చైనాతో పాటు ఇతర ఆసియా దేశాల్లో బాహుబలి 2 విడుదలకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. బాక్సాఫీస్ చరిత్రలో వేల కోట్ల లెక్కల రుచి టాలీవుడ్ కు చూపించిన తొలి సినిమా బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ లకే తలామానికంగా నిలిచి జాతి మీసం మెలేసి, ప్రతి భారతీయుడు కాలర్ ఎగరేసేలా విజయవిహారం చేసిన మూవీ బాహుబలి 2. 

samayam telugu bahubali japan కోసం చిత్ర ఫలితం

"హేస్సా!.. రుద్రస్సా!.. అంటూ ప్రపంచ నలుదిక్కులా సినీ ప్రేక్షకులను అలరిస్తూ, భారతీయ సినీ వినీల చలనచిత్ర అంబరాన్ని వెలుగులతో నింపిన బాక్స్ ఆఫీస్ లాండ్-మార్క్ నిలిచి రారాజుగా ప్రకాశించిస్తూ, నేటికీ తన ప్రభంజనానికి అడ్దులెదంటూ ఇతర ఆసియా దేశాలకు జైత్రయాత్ర చేయబోతుంది. దర్శకదిగ్గజం  రాజమౌళి సృజనాత్మకతకు ప్రభాస్, రానా, అనుష్క, రమ్యక్రిష్ణ నటవైభవం తోడై అత్యత్భుత సాంకేతిక విలువల విజువల్ వండర్‌ ను వెండితెరపైకి తెచ్చిన సాహస సంస్థ "ఆర్కా మీడియా వర్క్స్" అంతా తానై అంకితమై ఈ అద్భుత దృశ్య కావ్యాన్ని తర తరాలకు విస్తరించెలా నిర్మించిన అద్భుత దృశ్య కావ్యం ‘బాహుబలి ది కన్‌క్లూజన్’ మరింత గొప్పగా ప్రకాసించి రూపుదిద్దుకుంది.


ఈ భారీ బ్లాక్ బస్టర్ ‘బాహుబలి-2’ చిత్రాన్ని మిగతా ఆసియా  దేశాలైన జపాన్, చైనా, కొరియా దేశాల్లో విడుదల చేస్తున్నారు నిర్మాతలు. ఇప్పటికే చైనాలో భారీ రిలీజ్‌ కు సిద్దమైన బాహుబలి 2 చిత్రం యు/ఏ సర్టిఫికేట్‌ను పొందింది. తాజాగా ఈ విషయాన్ని ట్విట్టర్‌లో తెలియజేస్తూ ప్రభాస్, అనుష్క ఉన్న జపాన్ బాహుబలి 2 పోస్టర్‌ను విడుదల చేసింది చిత్రయూనిట్.  విడుదలైన అన్ని దేశాల్లో భారతీయ జాతి చిహ్నం జాతీయ పతాకాన్ని రెపరెపలాడించిన దృశ్య అద్భుతం ‘బాహుబలి2’ జపాన్‌లో కూడా సరికొత్త విజయాలను నమోదు చేస్తుందని అంటున్నారు. ఇక అక్కడా రికార్డ్స్‌ను క్రియేట్ చేయడం ఖాయం. 



ఈ మద్య రష్యా 'మాస్కో ఇంటర్నేషనల్ మూవీ ఫెస్టివల్‌' లో ప్రదర్శించిన ‘బాహుబలి 2’ మూవీకి అద్భుతమైన స్పందన రాగా.. ఈ చిత్రాన్ని చైనా, రష్యా, కొరియాదేశాల్లో విడుదల చేసేందుకు రడీ ఔతున్న బాహుబలి బృందానికి శుభాకాంక్షలు. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: