పవన్ సమస్యల పరిష్కారం వెనుక మ్యాజిక్ !

Seetha Sailaja
పవన్ అభిమానులు అంతా ‘అజ్ఞాతవాసి’ ఆడియో ఫంక్షన్ గురించి ఎదురు చూస్తూ ఉంటే పవన్ తన ఆర్ధిక విషయాలలో అనుసరిస్తున్న మ్యాజిక్ కు సంబంధించిన గాసిప్పులు ప్రస్తుతం టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారాయి. గతంలో పవన్ ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన వద్ద పెద్దగా క్యాష్ బ్యాలెన్స్ లు లేవని అందువల్ల తాను సినిమాలలో నటించవలసి వస్తోందని కామెంట్ చేసిన విషయం తెలిసిందే.

ఆతరువాత ‘సర్దార్ గబ్బర్ సింగ్’ ఆడియో ఫంక్షన్ లో చిరంజీవి మాట్లాడుతూ తన తమ్ముడు పవన్ చెప్పుకోతగ్గ విధంగా ఆస్థులు సంపాధించుకోలేకపోయాడని అందువల్ల పవన్ సినిమాలను వదిలి ప్రత్యక్ష రాజకీయాలలోకి రావడం తనకు ఇష్టంలేదు అంటూ ఓపెన్ గా చెప్పాడు. అయితే తన అన్న చెప్పిన మాటలకు ప్రభావితం అయికాబోలు పవన్ జయాపజయాలతో సంబంధం లేకుండా వరసపెట్టి సినిమాలు చేస్తూ ప్రతి సినిమాకు సుమారు 25 కోట్ల వరకు పారితోషికంగా తీసుకుంటున్నాడు అన్నమాటల గాసిప్పులు హడావిడి చేస్తున్నాయి. 

అయితే ప్రస్తుతం ఫిలింనగర్ లో హడావిడి చేస్తున్న వార్తలతో పాటు పవన్ ఈమధ్య మీడియాకు ఇస్తున్న లీకుల ప్రకారం ‘అజ్ఞాతవాసి’ తరువాత తాను ఇక సినిమాలు చేయనని తన మనసు అంతా ప్రజాసేవ వైపు రాజకీయాల వైపు పూర్తిగా ఉంది అన్న సంకేతాలు ఇస్తున్నాడు. దీనితో పవన్ ఇప్పుడు వెంటనే సినిమాలు మానివేస్తే ‘జనసేన’ పార్టీని నిలబెట్టడానికి అవసరం అయ్యే భారీ మొత్తాలు ఎవరు ఇస్తారు అన్నవిషయం పై ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. 

దీనితో పవన్ సినిమాలలో నటించకపోయినా ‘జనసేన’ కు ఆర్ధికపరమైన అండదండలు అందించడానికి చిరంజీవితో సన్నిహితంగా ఉండే ఒక ‘ప్రో మెగా కోటరీ’ అప్పుడే తమ రంగాన్ని సిద్ధం చేసుకుంటోంది అన్నవార్తలు వస్తున్నాయి. అందువల్లనే ఈమధ్య పవన్ తన ఉపన్యాసాలలో చిరంజీవి పై ప్రేమను కురిపిస్తూ తన అన్న అమాయకుడని వ్యూహాత్మక కామెంట్స్ చేస్తున్నట్లు టాక్. దీనినిబట్టి చూస్తుంటే రానున్న రోజులలో పవన్ అనుసరించే ఎత్తుగడలు తలలు పండిన రాజకీయ నాయకులకు కూడ అర్ధంకాని పరిస్థితి ఏర్పడుతుంది అన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి..  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: