జూనియర్ మాటలకు ఆశ్చర్యంలో కళ్యాణ్ రామ్ !

Seetha Sailaja
జూనియర్ ‘జై లవ కుశ’ ఏమేరకు రికార్డులను బ్రేక్ చేయగలిగింది అనే విషయం పక్కకు పెడితే సినిమా సమీక్షకులను దారినపోయే దానయ్యలుగా అభివర్ణించి జూనియర్ వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన విషయం తెలిసిందే. ఈ  కామెంట్స్ పెను సంచలనం సృష్టించడంతో ఇండస్ట్రీవర్గాలు చాలామంది  ఎన్టీఆర్ అభిప్రాయాలతో ఏకీభవిస్తూ జూనియర్ కు దన్నుగా నిలబడితే  మరికొందరు మాత్రం జూనియర్ కామెంట్స్ పై తీవ్ర విమర్శలు చేస్తు న్నారు.

అయితే ఫిలింనగర్ లో హడావిడి చేస్తున్న విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఎన్టీఆర్ సన్నిహితులు మాత్రం భవిష్యత్ లో ఇలా మాట్లాడవద్దని ఎన్టీఆర్ కు సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది. మీడియాతో సంయమనంగానే వుండాలి తప్ప రచ్చ చేసుకోవడం సరికాదని ఎన్టీఆర్ కు సన్నిహితులు వివరించి  చెప్పినట్లు తెలుస్తోంది.

దీనికితోడు ఆరోజు  జూనియర్  ఇలా వేదికమీద మాట్లాడతాడని ఆయన సన్నిహితులకు   ముఖ్యంగా కళ్యాణ్ రామ్ కు కూడా తెలియదని టాక్. అలా తెలిసి ఉంటే వద్దని చెప్పేవాడినని కళ్యాణ్ రామ్ జూనియర్ సన్నిహితులతో అన్నట్లు వార్తలు వస్తున్నాయి.  అంతేకాదు ‘బిగ్ బాస్’ టైమ్ లో ‘ జై లవ కుశ’ విడుదలకు ముందు మీడియా ఎంత కవరేజ్ ఇచ్చిందో తనకు తెలుసు అని కళ్యాణ్ రామ్ కామెంట్ చేసినట్లు టాక్ ఈ వార్తలలో ఎన్నినిజాలో తెలియకపోయినా ఈహాట్ గాసిప్ ఇప్పుడు హాట్ న్యూస్ గా మారింది.  

దీనితో జూనియర్ తన సన్నిహితులు ఇచ్చిన క్లాసుతో  అయిందేదో అయిపోయింది ఇకపై ఇలా బహిరంగంగా మీడియాపై కామెంట్ లు చేయనని తన సన్నిహితులతో చెప్పినట్లు తెలుస్తోంది.  దీనితో భవిష్యత్ లో ఎన్టీఆర్ మరోసారి ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలకు దూరంగా ఉండటం ఖాయం అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. 
గతంలో తన  సినిమాలు డిజాస్టర్లు అయినపుడు మీడియాను పల్లెత్తు మాట అనని ఎన్టీఆర్ సొంత సినిమా అనేసరికి విపరేతంగా బాధపడి ఉంటాడు అంటూ సెటైర్లు పడుతున్నాయి. ఏమైనా మీడియా సహకారం లేకుంటే అసలుకు మోసం వస్తుంది అన్న విషయం జూనియర్ కు బాగా అర్ధం అయింది అనుకోవాలి..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: