ప్రస్తుతం యూత్ లో మంచి ఫాలోయింగ్ సంపాధించుకుని క్రేజీ హీరోగా మారిపోయిన విజయ్ దేవరకొండ రాంగ్ రూట్ లో వెళుతున్నాడు అంటూ అతడి అభిమానులు సైతం కామెంట్స్ చేస్తున్న సందర్భం అత్యంత ఆశ్చర్యకరంగా మారింది. ‘అర్జున్ రెడ్డి’ తో యువతకి మరింత దగ్గరైన విజయ్ ఇకపై సరైన సినిమాలు ఎంచుకుని రైట్ గైడెన్స్ తీసుకుంటే ఖచ్చితంగా పెద్ద స్టార్ కాగలడు అన్న అభిప్రాయంలో అతడి అభిమానులు ఉన్నారు.
ఇలాంటి పరిస్థుతులలో వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ లేటెస్ట్ గా షేర్ చేసిన ఫోటో ఒకటి అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఈ ఫోటోలో వర్మ అర్జున్ రెడ్డితో కలిసి ఒక హోటల్ లో పార్టీని ఎంజాయ్ చేస్తున్న సందర్భం కనిపిస్తోంది.
ఇప్పటికే ‘అర్జున్ రెడ్డి’ ని ఆకాశంలోకి ఎత్తేస్తున్న వర్మ ‘నా ట్రైసెప్ (బాహువులు) చూసి విజయ్ నవ్వుకుంటున్నాడు’ అంటూ కామెంట్ చేస్తూ ఆ ఫోటోను షేర్ చేశాడు. దీనితో విజయ్ వర్మలకు ఇంత సాన్నిహిత్యం ఎప్పటి నుంచి ఏర్పడింది అన్న చర్చలు జరుగుతున్నాయి.
ప్రస్తుతం పరాజయాల బాట నడుస్తున్న వర్మ చేతిలో సినిమాలు లేకపోవడంతో ఎదో ఒక చెత్త కథతో విజయ్ దేవర కొండతో సినిమాను తీసి ఇతడి కెరియర్ ను పాడుచేస్తాడేమో అన్న అనుమానాలు కూడ వ్యక్తం అవుతున్నాయి. ఇది ఇలా ఉండగా ఓవర్ సీస్ లో అర్జున్ రెడ్డి ఇప్పటి వరకు 1.5 మిలియన్ డాలర్స్ కలక్ట్ చేసి 2 మిలియన్ డాలర్ల కలక్షన్స్ వైపు పరుగులు తీస్తోంది.
ఇప్పటి వరకు చరణ్ అల్లు అర్జున్ లకు కూడ అందని 2 మిలియన్ డాలర్ల రికార్డ్ ను అందుకోబోతున్న విజయ్ దేవరకొండ రామ్ గోపాల్ వర్మ లాంటి దర్శకుల బుట్టలో పడకుండా ఉంటే మంచిది అని సలహాలు వస్తున్నాయి అంటే ఈ ఒక్క ఫోటో విజయ్ అభిమానులలో ఎంత భయాన్ని సృష్టించిందో అర్ధం అవుతుంది..