నటించడమే కాకుండా పవన్ కు సినిమా రంగానికి సంబంధించిన అనేక విషయాలలో ప్రావిణ్యం ఉంది. ఆయన కధలు రాస్తాడు, ఫైట్స్ డిజైన్ చేస్తాడు, దర్శకత్వం వహిస్తాడు, పాటలు కూడా పాడతాడు. ఇలా అతడికి తెలియని విద్య లేదు. అందుకే పవర్ స్టార్ అంటే అంత క్రేజ్. తమ్ముడు, జానీ, ఖుషి సినిమాలలో జానపద పద పాటలు పాడుతూ, ధియేటర్ లో కూర్చున్న ప్రేక్షకులకు హుషారు తెప్పించిన పవన్, చాలా రోజుల తరువాత తన ‘అత్తారింటికి దారేది’ లో పాట పాడాడు అని అంటున్నాయి ఫిల్మ్ నగర్ వర్గాలు.
దేవిశ్రీ ప్రసాద్ పవన్ చేత ఈ సినిమాలో ఒక మాస్ సాంగ్ పాడించాడని, అయితే ఈ పాటను ఆడియో సిడి లో లేకుండా ప్రేక్షకులకు ఒకేఒక్క సారి షాక్ ఇవ్వడానికి ఈపాటను దాచేశారని అంటున్నారు. ఈ వార్తలకు బలం చేకూర్చేవిధంగా అత్తారింటికి దారేది ఆడియో వేడుకలో మాట్లాడిన బ్రహ్మానందం ఈ సినిమాలో ఇప్పుడు విడుదల అయిన పాటలు కాకుండా మరొక అదిరిపోయే పాట ఉందంటూ హింట్ ఇచ్చాడు. ఆ హింట్ అర్ధం ఇదే అంటున్నాయి ఫిల్మ్ నగర్ వర్గాలు. రోజురోజుకు ఒక్కో వార్త ఈ సినిమాకు సంబంధించి బయటకు వస్తూ పవన్ అభిమానులకు వచ్చే నెల 7 వ తారిఖు ఎప్పుడు వస్తుందా..? అని పించేటట్లుగా చేస్తూ నిద్రకు దూరం చేస్తున్నాయి అని అంటున్నారు.