హీరోలకు ఫ్యాన్స్ ఉన్నట్టే డైరక్టర్స్ కు ఉంటారు.. డైరక్టర్ ఎవరు అని చూసి సినిమాకు వెళ్లే రోజులివి. సో అలాంటి టాలీవుడ్ దర్శకుల్లో బోయపాటి శ్రీను ఒకరు. హీరోలకు మాస్ ఇమేజ్ తెప్పించే దర్శకుడిగా ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న ఈ దర్శకుడు లాస్ట్ ఇయర్ సరైనోడుతో బన్నికి బీభత్సమైన మాస్ ఫాలోయింగ్ వచ్చేలా చేశాడు. ఇక ఇప్పుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా జయ జానకి నాయకా సినిమా చేస్తున్నాడు బోయపాటి శ్రీను.
ఈ సినిమాకు బోయపాటి తన రక్తపాతం వదిలేశాడని అన్నారు. అంతేకాదు ఈ సినిమా టైటిల్ ఫస్ట్ లుక్ కూడా కాస్త షాక్ అయ్యేలా ఉన్నాయి. వాటిని చూస్తే ఇది బోయపాటి సినిమానా కాదా అన్న ఆలోచన వచ్చింది, అయితే రీసెంట్ గా ఆ సినిమా నుండి మరో పోస్టర్ రిలీజ్ అయ్యింది. అది చూసి ప్రేక్షకులనా ఇది బోయపాటి స్టైల్ అని అంటున్నారు.
మాస్ పవర్ తో బెల్లంకొండ శ్రీను పోస్టర్ అదరగొట్టింది. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో క్రేజీ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో కేథరిన్ త్రెసా హాట్ ఐటం సాంగ్ చేస్తుందని తెలుస్తుంది. ఆగష్టు 11న రిలీజ్ అవబోతున్న ఈ సినిమా బోయపాటి స్టామినా మరోసారి ప్రూవ్ చేస్తుందో లేడో చూడాలి.