సినిమా ఇండస్ట్రీలో మంచి హీరోయిన్ గా గుర్తంపు రావాలంటే కేవలం గ్లామర తరహా పాత్రలే కాకుండా కొన్ని సార్లు ప్రయోగాత్మక పాత్రలు కూడా చేయాల్సి వస్తుంది. అలాంటి పాత్రలు వేసే సమయంలో వాటికి అనుగుణంగా తయారు కావల్సి వస్తుంది. ఇండస్ట్రీలో ఎన్నో ప్రయోగాత్మక పాత్రల్లో కనిపించి విశ్వనటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు కమల్ హాసన్. ఆ తర్వాత విక్రమ్ కూడా అలాంటి ప్రయోగాత్మక పాత్రల్లో నటించాడు.
ఇక అందాల ముద్దుగుమ్మ అరుంధతితో ఎంతో పేరు తెచ్చుకున్న అనుష్క ఆ మద్య ‘సైజ్ జీరో’ కోసం తన బరువును అమాంతంగా పెంచేసుకుంది. అయితే సినిమా మాత్రం క్లిక్ కాలేదు కానీ అనుష్క పాత్రపై విమర్శకుల నుంచి ప్రశసంలు వచ్చాయి. తాజాగా అనుష్క బాటలోనే నడుస్తుంది..మళియాళ ముద్దుగుమ్మ కీర్తి సురేష్.
మహానటి సావిత్రి సినిమాలో గోల్డెన్ చాన్స్ కొట్టేసిన కీర్తి సురేష్, ఇప్పుడా సినిమా కోసం వెయిట్ పెంచేస్తుందట. సావిత్రి బయోపిక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో సావిత్రి గారి లైఫ్ లోని కొన్ని ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ ని హైలెట్ చేసే ప్రయత్నం చేస్తుంది సినిమా యూనిట్.
ఈ సినిమాలో జెమినీ గణేషన్ క్యారెక్టర్ లో దుల్కర్ సల్మాన్ నటిస్తుండగా, సమంతా కీ రోల్ ప్లే చేస్తుంది. నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాని స్వప్న దత్, ప్రియాంక దత్ కలిసి నిర్మిస్తున్నారు. మొత్తానికి సావిత్రి లా కనిపించడానికి కీర్తి సురేష్ డేడికేటెడ్ గా ప్రిపేర్ అవుతున్నట్టు తెలుస్తుంది.