ఒకప్పుడు టాలీవుడ్ ను ఊపు ఊపేసిన హీరోయిన్స్ మళ్లీ రీ ఎంట్రీతో రచ్చ రచ్చ చేస్తున్నారు. ఇప్పటికే నదియా, రాశి, ఖుష్బు లాంటి నాటి తరం భామలు క్యారక్టర్ ఆర్టిస్ట్ గా సెటిల్ అవుతున్నారు. ఇప్పుడు అదే దారిలో రాధికా సోదరి నిరోషా కూడా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుంది. మెగాస్టార్ చిరంజీవితో స్టూవర్టుపురం పోలీస్ స్టేషన్, మణిరత్నం ఘర్షణ సినిమాలతో పాటుగా బాలయ్య నారి నారి నడుమ మురారి సినిమాలలో నటించిన నిరోషా అప్పట్లో మంచి ఫాలోయింగ్ ఏర్పరచుకుంది.
ఇక తన సహనటుడి రాంకిని పెళ్లాడిన ఈ అమ్మడు మళ్లీ సినిమాల మీద మనసు పడ్డది. ప్రస్తుతం తెలుగులో సుధార్ హీరోగా నటిస్తున్న నువ్వు తోపురా సినిమాలో నటిస్తుంది నిరోషా. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలో నటించిన సుధాకర్ లీడ్ రోల్ లో వస్తున్న ఈ సినిమాలో పడేశావే హీరోయిన్ నిత్యా శెట్టి ఫీమేల్ లీడ్ గా నటిస్తుంది.
హరినాథ్ బాబు డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను యునైటెడ్ ఫిలింస్ బ్యానర్లో డి.శ్రీకాంత్ నిర్మిస్తున్నారు. రీ ఎంట్రీలో అదరగొడుతున్న అలాంటి భామల లానే నిరోషా కూడా నేటి తరం ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనే చెప్పొచ్చు. రొమాంటిక్ డ్రామాగా రాబోతున్న ఈ సినిమా ప్రేక్షకులను తప్పకుండా అలరిస్తుందని అంటున్నారు.
తెలుగులో సక్సెస్ అయితే మళ్లీ ఇక వరుస సినిమాలను చేసే ఆలోచనలో ఉంది నిరోషా. 2005లో తరుణ్ హీరోగా నటించిన ఒక ఊరిలో సినిమాలో అత్త పాత్రలో నటించి మెప్పించింది నిరోషా. మళ్లీ 12 సంవత్సరాల తర్వాత తెలుగులో నువ్వు తోపురా సినిమాతో వస్తుంది.