కుక్కపిల్ల కోసం బ్రతుకుతున్న చెర్రీ

K Prakesh
సెలబ్రిటీలు ఏమి చేసినా అది ప్రముఖ వార్తే. ముఖ్యంగా టాలీవుడ్ సెలబ్రిటీ ఫ్యామిలీ మెగా కుటుంబం ఏదైనా ఒక విషయం చేసింది అని తెలిస్తే ఇక మీడియా కు ఆరోజు పండుగే. ఆ వార్తలతో ప్రింట్ మీడియా, వెబ్ మీడియా, ఛానల్స్  రోజంతా గడిపేస్తారు.  ప్రస్తుతం మెగా కుటుంబం లో అటువంటి సంఘటన ఒకటి జరిగింది. రామ్ చరణ్ ను పెళ్లి చేసుకున్నాక ఉపాసన చెర్రి మొట్టమొదటి పుట్టినరోజు న అతడికి ఒక అరుదైన బహుమతి ని ఇవ్వాలని అనుకుంది.

 అంతే ఆమె చరణ్ కోసం విదేశాల నుంచి ఒక మంచి మేలుజాతి శునకాన్ని తీసుకువచ్చి, చరణ్ పుట్టిన రోజుకు కానుకగా అందజేసింది. చరణ్ దగ్గరకు వచ్చిన రెండు రోజులలోనే ఆ కుక్కపిల్ల చెర్రి కి బాగా దగ్గర అయింది. అంతేకాదు ఆ కుక్కపిల్ల కోసం ప్రస్తుతం చరణ్ పూర్తి శాకాహారి గా మారిపోయాడు. ఈ కధలో ఇదేమి ట్విస్ట్ అనుకుంటున్నారా...? ఉపాసన ఎంతో ప్రేమతో ఇచ్చిన ఈ కుక్కపిల్ల కు చెర్రి బ్రాట్ అని పేరుపెట్టి అల్లారు ముద్దుగా చూసుకుంటూ ఉంటె, ఈమధ్య ఈ శునక౦ కాలికి పెద్ద దెబ్బ తగిలిందట. దీనితో చెర్రి – ఉపాసన లు దగ్గర ఉండి ఆ కుక్కపిల్ల కు ఆపరేషన్ చేయి౦చి కాలిలో రాడ్ కూడా వేయి౦చారట. ఆ కుక్కకు ఆరోగ్యం చేకూరేదాకా తాను మాంసం ముట్టనని చెర్రి తన ఇష్టదైవం పై ప్రమాణం కూడా చేశాడట.

ఇంత కధకు సినిమా కధలో ఒక ఫ్లాష్ బ్యాక్ కూడా ఉంది. గతంలో చెర్రి దగ్గర లాబ్రిడార్ అనే కుక్క పిల్ల ఉండేదట. ఆ కుక్కపిల్ల కూడా అనుకోకుండా రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో చలించిపోయిన చెర్రి, అప్పట్లో ఆ కుక్క గురించి నాలుగు రోజులు అన్నపానియాలు మాని బెంగ పెట్టుకున్నాడట. మళ్ళి చాలాకాలం తరువాత రామ్ చరణ్ దగ్గరకు వచ్చిన మరొక కుక్కపిల్ల కు ఇలా ప్రమాదం జరిగింది. దీనిని బట్టి చూస్తే, చెర్రి జాతకానికి కుక్కపిల్లలు కలిసి రావేమో అనిపిస్తుంది.  
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: