నాగార్జున నిర్మించిన రారండోయ్ వేడుక చుద్దాం సినిమా ఆడియో వేడుకలో అనుకోకుండా సీనియర్ యాక్టర్ చలపతి రావు చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఆడాల్లు పక్కలోకి పనికొస్తారు అన్న చలపతి రావు మాటలకు మహిళా సంఘాల నుండి కూడా పెద్ద ఎత్తున నిరసనలు వస్తున్నాయి.
ఈ క్రమంలో నాగ్ ఈ విషయంపై స్పందిస్తూ తను పర్సనల్ గా ప్రొఫెషనల్ గా సినిమాల్లో ఆడవాళ్లను గౌరవిస్తానని. ఆడియో వేడుకలో చలపతి రావు మాట్లాడిన మాటలను తాను ఖండిస్తున్నానని ట్వీట్ చేశారు. ఇక ఈ విషయం పట్ల చలపతి రావు కూడా తాను మరే ఉద్దేశంతోనో అలా అనలేదని.. అయినా సరే తాను క్షమాపణలు చెబుతున్నానని అన్నారు.
అనవసరంగా నేను అన్న మాటలను నానార్ధాలు తీసి హంగామా చేస్తున్నారని అన్నారు. పక్కలోకి పనికివస్తారు అన్న మాట ఎంత అసభ్యకరం.. ఎంత దారుణమో అర్ధం చేసుకోవచ్చు. మరి అనాల్సిన మాట అనేసి ఇప్పుడు సారీ నా అర్ధం అది కాదు అంటే ఎవరు నమ్ముతారు చెప్పండి.
నాగార్జున మాత్రం తన ఫంక్షన్ కాబట్టి తన తరపున ఇవ్వాల్సిన వివరణ ఇచ్చారు. మరి ఈ గొడవ ఎందాకా వెళ్తుందో తెలియదు కాని రాక రాక మైక్ చేతికి వచ్చే సరికి ఏం మాట్లాడాలో తెలియని చలపతి రావు ఇలా బుక్కయ్యాడని అంటున్నారు సిని జనాలు.
I always respect women personally and in my films/I definitely do not agree wt Chalapati rao's derogatory comments/dinosaurs do not exist!!🙏— Nagarjuna Akkineni (@iamnagarjuna) May 23, 2017