మరోవారంలో విడుదలకాబోతున్న ‘బాహుబలి 2’ ఘనవిజయం సాధించి రికార్డులు క్రియేట్ చేస్తుంది అన్న అంచనాలు రోజురోజుకీ పెరిగిపోతు ఉంటే ఈమూవీ అనుకున్న రికార్డుల అంచనాలను అందుకుంటుందా అన్నభయంలో రాజమౌళి ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. నిన్నమొన్నటి వరకు షూటింగ్ హడావుడిలో ఉన్న రాజమౌళి దేశవ్యాప్తంగా విడుదలకాబోతున్న ఈసినిమా ప్రచారవిషయాల పై ఊపిరిసలపనంత బిజీలో ఉన్నాడని తెలుస్తోంది.
అయితే బాలీవుడ్ మీడియా రాస్తున్న కామెంట్స్ ప్రకారం ‘బాహుబలి 2’ ప్రచారవిషయంలో కాస్త వెనకబడిందని కామెంట్స్ చేస్తోంది. అంతేకాదు ఈమూవీ మొదటిభాగం రిలీజ్ కు వారంరోజుల ముందు ఉన్న పరిస్థితికి ఇప్పటి పరిస్థితికి పోల్చిచూస్తే తేడాకనిపిస్తోంది అని కామెంట్స్ చేయడం మరింత ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఇప్పటికే వందలకోట్ల రూపాయిల ఖర్చు ‘బాహుబలి 2’ ప్రమోషన్ మీదపెడుతున్నా బాలీవుడ్ మీడియా ఎందుకుఈవిధంగా ఈసినిమాను టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేస్తోందో ఎవరికీ అర్ధంకాని విషయంగా మారింది.
అంతేకాదు రాజమౌళి ఈసినిమాకు సంబంధించి కట్టప్ప విషయంలో కొనసాగించిన టాప్ సీక్రెట్ కొంత వరకు వికటించింది అని బాలీవుడ్ మీడియా కామెంట్స్ ను బట్టి అర్ధం అవుతోంది. అయితేఇప్పటికే తమ సినిమాకు వచ్చిన ప్రచారం ‘బాహుబలి2’ కు సరిపోతుందని రాజమౌళి ఫీల్ అవుతున్నట్లు టాక్. అయితే ముఖ్యంగా బాలీవుడ్ కోలీవుడ్ లలో ఈసినిమాకు సంబంధించి ఫస్ట్ పార్ట్ కి సెకండ్ పార్ట్ కి విడుదల విషయంలో పెద్ద గ్యాప్ వచ్చిన నేపధ్యంలో ఈమూవీ బాలీవుడ్ కోలీవుడ్ లలో అనుకున్న స్థాయిలో అద్భుతాలు చేయలేదు అన్నప్రచారం జరుగుతోంది.
దీనికితోడు ఈసినిమా ఫస్ట్ పార్ట్ విడుదల సమయంలో నార్త్ లో పెద్దగా అంచనాలు లేకపోవడంతో ఘనవిజయం సాధించింది. ఈసారి పార్ట్ 2 విషయంలో అంచనాలు పెంచేయడంతో ఏమాత్రం తేడా జరిగినా అది ‘బాహుబలి 2’ కలక్షన్స్ విషయమై భారీ ప్రభావం చూపించే అవకాసం ఉంది అని అంటున్నారు. దీనికితోడు ‘బహుబలి 2’కు అంత ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదన్నట్లుగా అండర్ కరెంట్ గా ఒక మెసేజ్ బాలీవుడ్ కోలీవుడ్ లలో పాస్ అవుతుందన్న మాటలు వినిపిస్తున్నాయి.
ఈకారణంగానే ఈసినిమా ఫస్ట్ పార్ట్ విడుదల సమయంలో మీడియా ఈసినిమాకు సహకరించినంతగా ‘బాహుబలి 2’ విషయంలో సహకరించడం లేదుఅన్న గాసిప్పులు కూడ ఉన్నాయి. దీనికితోడు ‘బాహుబలి 2’ 1000 కోట్ల కలక్షన్స్ లక్ష్యంగా విడుదల కాబోతోంది అని జరిగినప్రచారం బాలీవుడ్ కోలీవుడ్ మీడియాలకు అసూయ కలిగిస్తోంది అన్నమాటలు కూడ ఉన్నాయి. ఒక సౌత్ మూవీ ముఖ్యంగా ఒక తెలుగుసినిమా వెయ్యి కోట్ల కలెక్ట్ చేస్తుందన్న మాటమరీ ఎక్కువగా ఉందని బాలీవుడ్ మీడియాఅభిప్రాయ పడుతోంది అని టాక్. దీనితో ‘బాహుబలి 2’ ను వీలైనంత వరకూ అండర్ ప్లే చేయాలే తప్పించి మరీ అంచనాలు పెంచితే అనుకోని షాక్స్ తగిలే ఆస్కారం ఉంది అని అంటున్నారు. దీనితో దక్షిణాది ఉత్తరాది ఫీలింగ్స్ మధ్య ‘బాహుబలి 2’ ఇరుక్కుందా? అంటూ కొంతమంది అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు..