జై లవకుశకు బాబీతో సమస్యలు ?

Seetha Sailaja
‘బెంగాల్ టైగర్‌’ చిత్రంతో దర్శకుడిగా మారిన బాబీకి టాప్ హీరోలతో సినిమాలు చేసే అవకాసాలు వస్తున్నా పరిస్తితులు మాత్రం దర్శకుడు బాబీకి ఏమాత్రం కలిసి రావడంలేదు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ‘సర్దార్ గబ్బర్ సింగ్’ రూపంలో మంచి అవకాశం రావడంతో టాప్ డైరెక్టర్స్ లిస్టులో చేరిపోతాను అని కలలు కన్న బాబీ ఆశల పై ‘సర్దార్ గబ్బర్ సింగ్’ నిరాశను మిగిల్చిన విషయం తెలిసిందే.

సర్దార్ గబ్బర్ సింగ్’ షూటింగ్ సమయంలో పవన్ కల్యాణ్ అంతా చూసుకోవడంతో డమ్మీ డైరెక్టర్ గానే మిగిలిపోయాడు బాబీ.  ‘సర్దార్ గబ్బర్ సింగ్’ ఘోర పరాజయం తరువాత బాబీ వంక టాప్ హీరోలు ఎవరు చూడరు అన్నఅంచనాలు వచ్చినా దీనికి భిన్నంగా బాబీతో మూవీకి జూనియర్ ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. 

దీనితో బాబీ దశ మళ్ళీ తిరిగింది అనిఅనుకున్నారు అంతా.  దాదాపు వందకోట్ల రూపాయల భారీ  బడ్జెట్‌ మూవీ బాబీ చేతికిరావడం ఈమూవీ దర్శకుడుకే నమ్మలేని నిజంగా మారింది. అయితే ‘జై లవకుశ’ సినిమాకు బాబీ దర్శకుడు అయినా ఈసినిమాకు సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్న మురళీధరన్ ఆలోచనలకు అనుగుణంగా ‘జై లవకుశ’ తీయవలసిన పరిస్థితి బాబీకి ఏర్పడింది అంటూ గాసిప్పులు హడావిడి చేస్తున్నాయి.  

హాలీవుడ్ సాంకేతిక నిపుణులు పనిచేస్తున్న ఈసినిమా భారాన్ని బాబీ మోయగలడా అనే అనుమానం ఈసినిమా నిర్మిస్తున్న కళ్యాణ్ రామ్ కు ఏర్పడటంతో ‘పీకే’, ‘3 ఇడియెట్స్’, ‘మొహంజదారో’ లాంటి ఇతర బాలీవుడ్ హిట్ చిత్రాలకు పనిచేసిన మురళీధరన్ ‘జై లవకుశ’ కు  చిత్రానికి సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్న నేపధ్యంలో ఈచిత్ర షూటింగ్‌లో మురళీ ధరన్ బాబీ విజన్‌ ను పక్కన పెట్టి తనఆలోచనలకు అనుగుణంగా ఈసినిమా షూటింగ్ ను నడిపిస్తున్నాడు అన్న ప్రచారం జరుగుతోంది. అంతేకాదు ఈసినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ విషయంలో కూడ మురళీధరన్ మార్పులు చేర్పులు చేస్తున్నట్లు టాక్.

ప్రస్తుతం జరుగుతున్న ఈపరిస్థుతులను చూసి బాబి తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నట్లు ఫిలింనగర్ టాక్. దీనికితోడు బాబీ పరిస్థితి చూసి ఎన్టీఆర్ కూడా దర్శకత్వ శాఖలో వేలుపెడుతున్నట్టు ఫిలింనగర్ లో గాసిప్పులు హడావిడి చేస్తున్నాయి. దీనితో ఇన్నిచేతులు పడ్డ ‘జై లవకుశ’ ఫైనల్ అవుట్ పుట్ వచ్చేసరికి ఎలామారుతుందో అన్నభయంలో దర్శకుడు బాబీ ఉన్నట్లు టాక్. దీనితో టాప్ హీరోలతో సినిమాలు చేసే అవకాశాలు వస్తున్నా ఆ అవకాశాలను ఉపయోగించుకునే అదృష్టం బాబీకి కలగడం లేదు అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: